మాట అంటే సరిపోదు దాని మీద నిలబడాలి బేబమ్మ..!

Update: 2023-05-14 13:00 GMT
ఉప్పెన భామ కృతి శెట్టి కస్టడీ ప్రమోషన్స్ లో ఐటం సాంగ్స్ కి తాను సిద్ధం కాదని అంటుంది. ప్రస్తుతానికి వాటి గురించి ఆలోచించను.. తన మనసుకి నచ్చిన వాటినే చేస్తా.. మనసు చెప్పిందే కరెక్ట్ అంటూ కామెంట్స్ చేసింది. సమంత ఉ అంటావా సాంగ్ చాలా బాగా చేసింది కానీ అలాంటి ఆఫర్ తనకు వస్తే మాత్రం ప్రస్తుతం చేయనని అంటుంది కృతి శెట్టి. అయితే అమ్మడు హీరోయిన్ గా ఫాం లో ఉంది కాబట్టి ఆ మాట అన్నది కావొచ్చు ఎందుకంటే ఇప్పుడు అలాంటివి చేయనని చెప్పి కొద్దిగా ఫాం కోల్పోయాక కనీసం స్పెషల్ సాంగ్స్ అయినా చేస్తానని అనే ఛాన్స్ ఉంటుంది.

హీరోలకు ఉన్నంత ఎక్కువ కెరీర్ స్పాన్ హీరోయిన్స్ కు ఉండదు. చాలా తక్కువ మంది హీరోయిన్లు దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో ఉంటూ వస్తారు. అయితే కెరీర్ మొదట్లో హీరోయిన్ గా ఛాన్స్ లు వచ్చినా చిన్నగా అవకాశాలు తగ్గుకున్నా కొద్ది ఎలాగైనా వాటిని దక్కించుకోవాలని అనుకుంటారు హీరోయిన్స్. ఈ క్రమంలో మొదట్లో గ్లామర్ షోకి కూడా నో అన్న వారు కూడా బికినీ వేయాల్సి వస్తుంది.

ఇక స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ అయితే మాత్రం ముందు కాదు కూడదు అన్న వారు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ముందు మాట అనేసి ఆ తర్వాత ఛాన్స్ లేక తప్పలేదు అంటే కుదరదు. బేబమ్మ కూడా ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి కదా అని ఐటెం సాంగ్స్ అంటే ఆసక్తి లేనట్టుగా తన ఒపీనియన్ చెప్పింది. కానీ కృతి శెట్టి కూడా ఫ్యూచర్ లో ఐటెం సాంగ్ చేసే రోజు రాకపోదు ఆ టైం లో అమ్మడు ఇప్పుడు చేసిన ఈ కామెంట్స్ నే ఆమెకు రివర్స్ లో చెప్పి కౌంటర్ ఎటాక్ చేస్తారు.

ఈ మధ్యనే కస్టడీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి శెట్టి తన నెక్స్ట్ సినిమా యువ హీరో శర్వానంద్ తో చేస్తుంది. ఆ సినిమా మీద చాలా గురి పెట్టుకుంది అమ్మడు. ఉప్పెన తర్వాత తన పాత్రకు అంత ప్రాధాన్యత ఉన్న సినిమా అది అని చెబుతుంది అమ్మడు.

Similar News