ఇన్నాళ్లైనా ముద్దుగుమ్మ అదే అందం.. అదే ఆరబోత

Update: 2022-09-12 17:30 GMT
టాలీవుడ్ లో అక్కినేని హీరో సుమంత్ నటించిన బోణి సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. మొదటి సినిమాతోనే నిరాశ పర్చిన కూడా ఈ ముద్దుగుమ్మకు బాగానే ఆఫర్లు వచ్చాయి. మొదటి సినిమా తర్వాత కాస్త గ్యాప్‌ వచ్చినా కూడా ఏకంగా పవన్‌ కళ్యాణ్ వంటి స్టార్‌ హీరో సినిమాలో హీరోయిన్ గా కాకున్నా కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చింది. దాంతో ముద్దుగుమ్మ బిజీ అయ్యింది.

పవన్ కళ్యాణ్ తీన్మార్‌ సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో అక్కడ నుండి వరుసగా ఆఫర్లు వచ్చాయి. కానీ దురదృష్టం కొద్దీ సక్సెస్ లు.. సూపర్‌ హిట్‌ లు ఆమెకు దక్కలేదు. దాంతో ఇండస్ట్రీ నుండి చాలా తొందరగానే ఆమె కనిపించకుండా వెళ్లి పోతుందని అంతా భావించారు. కానీ హీరోయిన్ గానే అని కాకుండా వచ్చిన ప్రతి ఒక్క పాత్రకు ఓకే చెబుతూ వచ్చింది.

దాంతో ఇన్నాళ్లు అయినా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో తెలుగు కంటే కూడా అధికంగా హిందీ మరియు ఇతర భాషల ఇండస్ట్రీపై శ్రద్ద పెట్టింది. అందుకే అక్కడ వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఒక వైపు బిజీ బిజీగా సినిమాల్లో నటిస్తూ మరో వైపు అందాల ఆరబోత తో ఎప్పటికప్పుడు మీడియాలో ఉండేందుకు ఈ అమ్మడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

అందులో భాగంగానే ఎయిర్ పోర్ట్‌ లో ఇలా జాకెట్‌ జిప్ తీసి మరీ తన అందాల ఆరబోత చేస్తూ ఉంది. నడుము అందాలను చూపించడంతో పాటు క్లీవేజ్ షో తో కుర్రకారు మతులు పోగొడుతోంది. వయసు పెరుగుతున్నా కొద్దీ ఈ అమ్మడి యొక్క అందం మరింతగా పెరుగుతుందా అన్నట్లుగా ఈ అమ్మడి యొక్క అందం ఉందంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు లో ఈమె మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని తెలుగు నెటిజన్స్ కోరుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News