ఫోటో స్టోరీ : వయ్యారాల జాబిల్లి.. వావ్ అనిపిస్తుందిగా..!

Update: 2022-10-20 01:30 GMT
గ్లామర్ ఫీల్డ్ లో నెగ్గుకు రావాలంటే కేవలం అందం ఒక్కటే ఉంటే సరిపోదు.. అందంతో పాటుగా టాలెంట్ కూడా ఉన్నా కొన్నిసార్లు లక్ కలిసి రాక కొందరు వెనకపడిపోతారు. సరిగ్గా ఈ అమ్మడు విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు.

తెలుగు సినిమా బోణీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి కర్బంధా హిట్ బోణీ కొడుతుందని అనుకుంటే నిరాశపరచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నా సరే అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఆ సినిమాలో చాలా మంచి స్కోప్ దొరికినా సరే సినిమా ఫ్లాప్ అవడంతో కృతి కెరియర్ మీద బాగా ఎఫెక్ట్ పడ్డది.      

మంచు మనోజ్ తో మిస్టర్ నూకయ్య.. కళ్యాణ్ రామ్ తో ఓం త్రీడీ సినిమాల్లో కూడా నటించిన కృతి కర్బందా ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది. ఇక్కడ ఎలాగు సక్సెస్ రాలేదని బాలీవుడ్ బాట పట్టిన కృతికి అక్కడ ఓ మోస్తారుగా పర్వాలేదన్నట్టుగా కెరియర్ కొనసాగింది. ఇక్కడ కనీసం నడుము కూడా చూపించడానికి ఇష్టపడని అమ్మడు బాలీవుడ్ లో ఇంటి మేట్ సీన్స్ కి సై అనేసింది. ఆ హాట్ ఇమేజ్ తోనే కెరియర్ నెట్టుకొస్తూ వస్తుంది. బాలీవుడ్ హాట్ భామల సరసన నిలిచేందుకు తెగ కష్టపడుతున్న కృతి కర్బంధా వారి దారిలోనే గ్లామర్ ఎటాక్ తో రెచ్చిపోతుంది.  

లేటెస్ట్ గా మరో హాట్ ఫోటో షూట్ తో కృతి ప్రేక్షకులను డిస్ట్రబ్ చేస్తుంది. రెడ్ కలర్ అవుట్ ఫిట్ తో థైస్ షోస్ చేస్తూ అమ్మడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. గ్లామర్ డోస్ తో కుర్రాళ్లని నిద్రపోనివ్వకుండా చేస్తూ రోజు రోజుకి తన గ్లామర్ డోస్ పెంచేస్తున్న కృతి కర్బంధాకి సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా పాపులారిటీ వచ్చిందని చెప్పొచ్చు.

తెలుగులో ఆమె చేసిన సినిమాలు నిరాశపరచినా ఇప్పటికీ కృతి కర్బంధా హీరోయిన్ గా కావాలని కోరుతున్నారు. చివరగా రాం చరణ్ బ్రూస్ లీలో సిస్టర్ రోల్ లో కనిపించిన కృతి ఆ సినిమా కూడా ఫెయిల్ అవడంతో టాలీవుడ్ అంటేనే ఆసక్తి చూపించట్లేదని తెలుస్తుంది.

తీన్మార్ సినిమాలో ఓణీ కట్టి వయ్యారాల జాబిల్లి అనిపించిన కృతి ఇప్పుడు స్కిన్ షోతో వావ్ అనిపించేస్తుంది. ఈ రేంజ్ లో గ్లామర్ డోస్ పెంచినా అమ్మడికి సరైన ఛాన్సులు మాత్రం రావట్లేదని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News