సూటి ప్రశ్నలకు అంతే సూటిగా సమాధానాలు చెప్పేవారు చాలా తక్కువగా ఉంటారు. అందులోకి వివాదం అయ్యే ఛాన్సు ఉంటే.. వాటికి రెండు..మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉండే సెలబ్రిటీలు కొందరైతే.. మరికొందరు మాత్రం.. అందుకు భిన్నంగా తనను అడిగిన దానికి అడిగినట్లుగా బదులిస్తారు. అయితే.. వాటిని ట్విస్టు చేసి కొందరు కొత్త రచ్చకు తెర తీస్తారు. ఇలాంటి వారి కారణంగా.. అవసరం లేని విషయాల్లో అనవసరమైన ప్రచారం సాగుతుంటుంది. అయితే.. కొందరు ఈ తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఫీల్ అవుతుంటారు.
అందుకు భిన్నంగా ఉంటారు పొడుగు భామ కృతీ సనన్. తాజాగా ఆమె డార్లింగ్ ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ లో నటిస్తున్నారు. ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తే.. కృతీ సనన్ సీతగా నటించారు. ఈ మూవీ వచ్చే ఆగస్టు 11న విడుదల కానుంది. అందరికి తెలిసిన రామాయణాన్ని.. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ముడి వస్తువుగా వాడిన ఇతిహాసాన్ని మరోసారి తీయాలనుకోవటం సాహసమే. అందులోకి భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ గురించి ఈ మధ్యన కృతీ సనన్ చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. ఒక ఇంటర్వ్యూలో ఆమెను పెళ్లి ఎవరిని చేసుకుంటావ్? (అవకాశం వస్తే).. డేట్ ఎవరితో చేస్తావన్న చిలిపి ప్రశ్నకు.. పెళ్లి చేసుకునే అవకాశం ఉంటే ప్రభాస్ ను చేసుకుంటానని చెప్పి హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఇదో ర్యాపిడ్ క్వశ్చన్ కు రాపిడ్ సమాధానం మాత్రమే. అందుకు భిన్నంగా 'ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా' అంటూ ఆమె స్టేట్ మెంట్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగింది.
అయితే.. ఆ వార్తల్ని స్పోర్టివ్ గా తీసుకుందే తప్పించి దానిపై స్పందించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్ గురించి మరిన్ని ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించింది. చాలా కాలంగా ప్రభాస్ తో పని చేయాలని తన కోరిక అని.. తాజా ప్రాజెక్టుతో అది తీరిందని పేర్కొన్నారు. ప్రభాస్ చాలా పొడవు ఉంటారని.. అందువల్ల తామిద్దరం ప్రొఫెషనల్ కాస్టూమ్స్ లో ఉన్నప్పుడు తమ జంట మరింత బాగుంటుందన్నారు.
తొలి షెడ్యూల్ లో ప్రభాస్ తో చేశానని.. రెండో షెడ్యూల్ కు రెఢీ అవుతున్నట్లు చెప్పిన ఆమె.. ప్రభాస్ గుణగణాల్ని ఏకరువు పెట్టింది. 'అతను చాలా సరదా వ్యక్తి. మంచివాడు. ఎంతో వినయస్తుడు. భోజన ప్రియుడు. అలానే చాలామంది ప్రభాస్ బిడియం ఎక్కువని.. ఎవరితోనే పెద్దగా మాట్లాడడని అంటారు. కానీ.. అది నిజం కాదు. అతను చాలా బాగా మాట్లాడతాడు. అతనితో నాకు మంచి సానిహిత్యం ఉంది' అంటూ కొత్త కోణాల్ని బయటకు తీసింది. మరి.. దీనికి సోషల్ మీడియా ఎలా రియాక్టు అవుతుందో?