వేదిక‌పై ఎమోష‌న్ ఆపుకోలేక‌పోయిన సీతా దేవి

Update: 2022-10-04 08:30 GMT
కృతి సనన్ పరిచయం అవ‌స‌రం లేదు. 1-నేనొక్క‌డినే (మ‌హేష్‌) చిత్రంతో టాలీవుడ్ లో క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసిన ఈ బ్యూటీ అటుపై నాగ‌చైత‌న్య 'దోచేయ్' అనే చిత్రంలో న‌టించింది. కానీ ఇవేవీ త‌న‌కు విజ‌యాల్ని ఇవ్వ‌లేదు. అదే క్రమంలో టాలీవుడ్ కి దూర‌మైంది. కానీ ఇప్పుడు ఆదిపురుష్ రూపంలో అద్భుత‌మైన అవ‌కాశం త‌న‌ను వ‌రించింది. ఈ సినిమాపైనే త‌న హోప్స్ అన్నీ. ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ స‌ర‌స‌న న‌టించ‌డంతో ఇప్పుడు క‌ళ్ల‌న్నీ కృతిపైనే ఉన్నాయి.

ప్రభాస్- కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ ఆదివారం రాత్రి అయోధ్యలో విడుదలైంది. ప్రభాస్ శ్రీరామునిగా నటించ‌గా ఇందులో సీత పాత్రను కృతి పోషించింది. టీజర్ లో కృతి లీలక్ దుస్తులలో అంద‌మైన‌ మనోహరమైన సీతగా క‌నిపించింది. ఈ సినిమా త‌న క‌ల‌ల‌ను నెర‌వేరుస్తుంద‌ని కృతి స‌నోన్ ఆశాభావం వ్య‌క్తం చేసింది.  ఇది కలల అనుభవం! అంటూ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. నేను మీ అందరినీ నిరాశపరచనని ఆశిస్తున్నాను అని కూడా అంది.

టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా కృతి తన పాత్ర గురించి మాట్లాడుతూ- "చాలా కొద్ది మంది నటీనటులకు ఇలాంటి సినిమాలో భాగమయ్యే అవకాశం లభిస్తుంది. ఇలాంటి పాత్రను పోషించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను నా జీవితంలో చాలా ప్రారంభంలోనే ఒక గొప్ప అవ‌కాశం పొందాను.

నా పాత్ర షూటింగ్ చివరి రోజు నాకు గుర్తుంది. నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. ఎందుకంటే నేను టీమ్ ను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఇది ఒక కలల‌ అనుభవం. నేను మీ అందరినీ నిరాశపరచనని ఆశిస్తున్నాను. మీరు నన్ను ఇష్టపడతారని భావిస్తున్నాను" అంటూ ఎమోష‌న‌ల్ అయ్యింది.

చెడుపై మంచి సాధించిన విజయాన్ని సెల‌బ్రేట్ చేయండి! అంటూ  రామాయణం ఆధారంగా ఈ సినిమాని ఓంరౌత్ అత్యంత భారీ కాన్వాసుపై తెర‌కెక్కించారు. టీ సిరీస్ -రెట్రోఫైల్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్ లార్డ్ రామ్ గా కనిపించగా... కృతి జానకి (సీత) పాత్రను పోషించింది. ఇందులో లంకేష్ గా సైఫ్ అలీ ఖాన్ .. లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటించారు. ఆదిపురుష్ 2023 జనవరి 12న IMAX స‌హా 2డి.. 3Dలో విడుదల కానుంది. హిందీ- తమిళం- తెలుగు- కన్నడ- మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదలవుతోంది.

ఆదిపురుష్ కాకుండా కృతి  లైనప్ ప‌రిశీలిస్తే ఆసక్తిక‌రం. భేదియా- షెహజాదా- గణపత్ వంటి భారీ చిత్రాలలో న‌టిస్తూ బిజీగా ఉంది. అనురాగ్ కశ్యప్ తో ఒక చిత్రం చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది. ఇందులో కృతి పూర్తిగా కొత్త అవతార్ లో కనిపిస్తుంద‌ని స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News