పెళ్లి - సంసారం ఎవరికైనా తప్పదు. అనుష్క, త్రిష, తమన్నా ఎవరికైనా ఏదో ఒకరోజు వివాహం తప్పనిసరి. అయితే కొందరికి ముందుగా, మరికొందరికి ఆలస్యంగా జరుగుతుంది అంతే. ఇప్పుడు ఇదే ప్రశ్న యంగ్ హీరోయిన్ కృతి సనోన్ నే అడిగితే ఏం చెప్పిందో తెలుసా? బంధం ముడిపడడానికి, బలపడడానికి టైమ్ పడుతుంది. కాస్త వెయిట్ చేయాలి. ఇప్పటికైతే నావాడి గురించి ఆలోచించే టైమ్ లేదు. నా దృష్టంతా కెరీర్ పైనే అని చెప్పింది.
షారూక్ సరసన దిల్ వాలే చిత్రంలో నటిస్తున్నా.. అతడితో కెరీర్ ఆరంభమే అవకాశం వస్తుందని ఊహించలేదు. అదృష్టం కొద్దీ హీరో ప్యాంటీ - 1నేనొక్కడినే లాంటి సినిమాల్లో నటించాను. కెరీర్ ఆరంభమే మహేష్ - నాగచైతన్య లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చిందంటే అది నా అదృష్టమే. అంత పెద్ద స్టార్ లతో నటించాను కాబట్టి నన్ను నేను పెద్ద స్టార్ ని అని అనుకోను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. తలబిరుసు లేకుండా పనిచేస్తాను. పెద్ద నటిని అని నిరూపించుకుంటా.. అని చెబుతోంది కృతి. పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తాను. ఎందుకంటే మనపై నెగెటివ్ ఇంప్రెషన్ పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇండస్ర్టీలో ఎదగాలంటే బ్యాక్ గ్రౌండ్ తప్పనిసరి. ఓ గాడ్ ఫాదర్ ఉంటే పని సులువవుతుంది. అవేవీ లేకుండానే అవకాశాల్ని అందుకోవడం నా అదృష్టం అని చెప్పింది.
అలాగే నటించడానికి అందం ఒక్కటే ఉంటే సరిపోదు. పెర్ఫామెన్స్ లేకపోతే నటి క్లిక్కవ్వడం కష్టం.. అని కృతి అనుభవ పాఠాల్ని చెప్పింది. మళ్లీ ఓ తెలుగు సినిమాలో నటించేది ఎప్పుడు.? అన్నది చెప్పనేలేదు.