ఈవిడకి రాకుమారి బెడ్‌రూమ్‌ రెడీ

Update: 2015-07-17 05:19 GMT
వయసొచ్చిన అమ్మాయి కలలు కనే తీరు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఓ అందమైన రాకుమారుడు తమని ముద్దాడినట్టు, కౌగిలించుకున్నట్టు, ప్రేమవనంలో విరహవేదనతో రాకుమారిడి కోసం వీక్షిస్తున్నట్టు.. కలలు కనేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి సందర్భాన్ని ఆస్వాధిస్తోంది '1' ఫేం కృతిసనోన్‌.

దోచెయ్‌ తర్వాత ఈ అమ్మడు షారూక్‌ చిత్రం దిల్‌వాలేలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఈ భామ కొద్దిరోజులు సెలవు తీసుకుని ఓ వీడియో ఆల్బమ్‌ షూటింగులో పాల్గొంటోంది. తన డెబ్యూ సినిమా 'హీరో పాంటీ' హీరో టైగర్‌ ష్రాప్‌తో కలిసి ఓ వీడియో ఆల్బమ్‌ చిత్రీకరణలో పాల్గొంటోంది. ఓ అందమైన రాకుమారి బెడ్‌రూమ్‌ని ఈ పాట కోసం రెడీ చేశారు. ఎటు చూసినా ఖరీదైన తల్పాలు.. తీర్చిదిద్దిన ఫ్రేములతో మిర్రర్స్‌ ఆ రూమ్‌లో ఉన్నాయి. రాజుగారి కోసం వేచి చూసే రాణుల బెడ్‌రూమ్‌లా తీర్చిదిద్దారు. అందుకే ఆ బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే తనని తాను మైమరిచిపోయి కృతి రాకుమారిలా ప్రవర్తించేస్తోందిట.

అంతేనా ఆ  బెడ్‌రూమ్‌ తల్పంపై పవళించి తన మొబైల్‌లో సెల్ఫీలు, ఫోటోగ్రాఫ్‌లు తీసుకుంటోందిట. ఈవిడ గారి పిచ్చికి వీడియో రూపకర్త భూషణ్‌కుమార్‌ తెగ ఆశ్చర్యపోతున్నాడని సమాచారం. అసలే ఈడొచ్చిన పిల్ల. ఆ మాత్రం ఉంటుంది లెండి!
Tags:    

Similar News