అన్యాయం జరుగుతుందన్న మహేష్‌ హీరోయిన్‌

Update: 2019-09-24 15:39 GMT
సౌత్‌ హీరోయిన్స్‌ తో పోల్చితే బాలీవుడ్‌ హీరోయిన్స్‌ పారితోషికం చాలా ఎక్కువగా ఉంటుంది. సౌత్‌ లో ఒక హీరోయిన్‌ రెండు కోట్లు తీసుకుందంటే గొప్ప విషయం. కాని బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్స్‌ పలువురు సినిమాకు పదుల కోట్లు తీసుకుంటున్నారు. అయినా కూడా బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కొందరు హీరోల స్థాయిలో తమ పారితోషికం ఉండటం లేదని వాపోతున్నారు. బాలీవుడ్‌ లో హీరోయిన్స్‌ పారితోషికం విషయంలో గొంతెత్తడం చాలా కామన్‌ అయ్యింది.

ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన ఒక సదస్సులో హీరోయిన్‌ కృతి సనన్‌ పాల్గొంది. గతంలో మహేష్‌ బాబుతో '1 నేనొక్కడినే' చిత్రంలో నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్‌ లో చాలా బిజీ హీరోయిన్‌. ఈమె ఈ సదస్సులలో మాట్లాడుతూ బాలీవుడ్‌ హీరోయిన్స్‌ రెమ్యూనరేషన్‌ గురించి మాట్లాడింది. బాలీవుడ్‌ లో రెమ్యూనరేషన్‌ విషయంలో హీరోయిన్స్‌ కు హీరోలతో పోల్చితే నాలుగు రెట్ల అన్యాయం జరుగుతుంది. హీరోయిన్స్‌ పై బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ వివక్ష చూపడం అన్యాయం - హీరోయిన్స్‌ విషయంలో చిన్న చూపు చూడటంతో పాటు పారితోషికం విషయంలో చాలా కుచుంచుకుని ప్రవర్తిస్తున్నారు.

హీరోయిన్స్‌ కూడా వంద కోట్ల రూపాయలను వసూళ్లు చేస్తున్నారు. బాలీవుడ్‌ లో పలు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు వందల కోట్లు సాధించాయి. అయినా కూడా ఇంకా హీరోయిన్స్‌ అంటే చిన్న చూపు చూస్తున్నారు. ఇది ఇంకా ఎంత కాలం ఉంటుందో అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హీరోయిన్స్‌ పారితోషికం హీరోలతో సమానం అయినప్పుడే వివక్ష అనేది తగ్గినట్లు అంటూ కృతి సనన్‌ అంటోంది.


Tags:    

Similar News