ప్రభాస్ హీరోయిన్ గ్లామరస్ క్యాలెండర్ షూట్..!

Update: 2021-06-22 15:52 GMT
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ప్రారంభం నుండి కెరీర్ ఓ స్టేజికి చేరుకున్నాక వారిలోని అదనపు టాలెంట్స్ బయటపెడుతుంటారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్.. కేవలం నటన మాత్రమే కాదు. అమ్మడికి కవితలు రాయడంలో మంచి ప్రావీణ్యం ఉంది. ఆల్రెడీ తన పోయెట్రీ టాలెంట్ కూడా పలుమార్లు ప్రూవ్ చేసుకుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ తరచుగా తన ఫిట్నెస్ వర్కౌట్.. వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అలాగే అభిమానులకు ఎప్పటికప్పుడు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి ఫోటోస్ షేర్ చేస్తోంది.

అయితే తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని.. తన 2021 క్యాలెండర్ కోసం కృతిసనన్ తో ఫోటోషూట్ జరిపాడు. డెబూ రత్నాని షూట్ కు సంబంధించిన పిక్ కృతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ న్యూ ఫోటోషూట్ లో గ్లామరస్ బ్యూటీ టాప్ టు బాటమ్ బ్లాక్ ధరించి ఉంది. అమ్మడు బ్లాక్ బ్రాలెట్ - లెదర్ ప్యాంటుతో పాటు బ్లాక్ స్టిలెట్టోస్‌ ధరించింది. ఇది కృతి కెరీర్ లో 6వ క్యాలెండర్ షూట్ కావడం విశేషం. ఈ షూట్ లో రెట్టింపు అందంతో కృతి.. డిఫరెంట్ రింగ్స్.. బ్యాంగిల్స్.. అలాగే అందుమైన డాంగ్లర్స్ ధరించి అభిమానులకు కిక్కిస్తోంది.

ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ యాక్ట్రెస్ అయిపోయింది. డెబ్యూ టాలీవుడ్ లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన చేసిన కృతి.. ఆ తర్వాత దోచేయ్ సినిమా చేసి ప్లాప్ అందుకుంది. ఆ వెంటనే ఆలస్యం చేయకుండా బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. కొంతకాలంగా బాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటిస్తోంది. మొదటిసారి ఆదిపురుష్ సినిమాతో కృతి సౌత్ లోని అన్ని భాషలతో పాటు దేశవ్యాప్తంగా పరిచయం కాబోతుంది. అలాగే కృతి ఇప్పుడు మిమి.. గణపత్.. హమ్ దో హమారే దో.. భేడియా.. బచ్చన్ పాండే సినిమాలు లైనప్ చేసింది.
Tags:    

Similar News