ఫ్లాప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మాయి హీరోయిన్గా నిలబడటమే ఆశ్చర్యమైతే.. ఊపిరి సలపనంత బిజీ అయిపోవడం విడ్డూరం. కృతి సనన్ విషయంలో ఇదే జరుగుతోంది. మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమాతో ముందు టాలీవుడ్లో అరంగేట్రం చేసిన కృతి.. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి 'హీరో పంటి'తో హిందీ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా ఓమాదిరిగానే ఆడినప్పటికీ కృతి టాలెంట్ ఏంటో బాలీవుడ్ జనాలకు తెలిసి వరుసగా అవకాశాలిచ్చేస్తున్నారు. మరోవైపు '1' ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నాగచైతన్య సినిమా 'దోచేయ్'లోనూ కృతికి ఛాన్స్ ఇచ్చాడు డైరెక్టర్ సుధీర్ వర్మ.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్, కాజోల్ అతిథి పాత్రలు పోషిస్తున్న 'దిల్వాలే' సినిమాలో వరుణ్ ధావన్ సరసన లీడ్ రోల్ చేస్తోంది కృతి. దీంతో పాటు మరో క్రేజీ ప్రాజెక్టు ఆమె చేతిలో ఉంది. ఐతే ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా తెరకెక్కబోయే 'సింగ్ ఈజ్ బ్లింగ్'లోనూ ఆమె నటించాల్సి ఉంది. కానీ ముందు ఈ సినిమాకు ఓకే చేసినప్పటికీ అనుకున్న సమయానికి సినిమా మొదలు కాలేదు. ఆలోపు డేట్లన్నీ వేరే సినిమాలకు ఇచ్చేసింది. ఇంకో ఆర్నెల్ల వరకు ఆమెకు ఖాళీ లేదట. ఇంతలో 'సింగ్ ఈజ్ బ్లింగ్' మొదలైపోయింది. డేట్లు ఖాళీ లేకపోవడంతో ఆ సినిమాను వదులకోక తప్పలేదు. విశేషమేంటంటే.. ఈ సినిమాకు ఓకే చెప్పిన సమయంలో ప్రభుదేవా సూచన మేరకు ఆమె కరాటె కూడా నేర్చుకుంది. కానీ ఇప్పుడా కష్టమంతా వృథా అయిపోయింది.