రాబ్తా సినిమా ఎంత తొందరగా వచ్చిందో అంతా తొందరగా బాక్స్ ఆఫీసు దగ్గర ఉండకుండా వెళ్లిపోయింది. సినిమా ఏమి మార్కెట్ చేయలేదు కానీ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అండ్ కృతి సనోన్ ల లవ్ కహానీ మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. వీళ్ళు కలిసి డిన్నర్లు చేయడం, అప్పుడుప్పుడు కాఫిలుకు వెళ్ళడం చేస్తూ మీడియాకు దొరికారు. కానీ మా మధ్య ప్రేమ లేదు స్నేహం మాత్రమే ఉందంటూ గట్టిగా చెప్పేస్తున్నారు. ఇప్పుడిక సుశాంత్ పై ఒక ఆసక్తికర కామెంట్ చేసింది ప్రేమలో లేని ప్రేయసి.. 1-నేనొక్కడినే ఫేం కృతి.
సుశాంత్ రాజ్పుత్ బాలీవుడ్ లో బందువుల వలనో.. లేక వాళ్ళ కుటంబం మూవీ బిజినెస్ లో ఉండడటం వలనో.. హీరో కాలేదు. ముందు టివిలో ఆ తరువాత సెకండ్ హీరోగా ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు. అందుకే సుశాంత్ తన ట్విటర్ లో కొన్నిసార్లు చాలా లోతైన ఆలోచన కలిగిన మాటలను రాస్తుంటాడు. ఆ మాట కొంత మందికి అర్ధమవ్వక చాలా రకరకాలుగా దాన్ని మార్చి వైరల్ చేస్తారు. ఇదే మాట కృతి సనోన్ ను అడిగితే ఫక్కున నవ్వి “ఆహ్ కొన్నిసార్లు ఏమన్నాడో అర్ధం అవుతుంది. నేను మరి అంత తెలివితక్కువదాన్ని కాను. కానీ కొన్నిసార్లు ఏమి అర్ధం కావు. పూర్తిగా బాల్ బౌన్స్ అవుతుంది. అలాంటప్పుడు అతను అన్నది అలా ఒప్పుకుంటే సరిపోతుంది. వాడు కొన్ని సార్లు ఎవడికి అర్ధం కాడు'' అని చెప్పింది
అసలు ఇంత డీప్ గా ఒక వ్యక్తి గురించి చెప్పిందంటే.. అది కేవలం ఫ్రెండ్షిప్ అనే అనుకోవాలా? ఇప్పడు బాలీవుడ్ బాబులు అదే తెలియకు గోళ్లు గిల్లుకుంటున్నారు. ఇకపోతే సుశాంత్ ఇప్పుడు తన కొత్త సినిమా ‘తకదుమ్’ కోసం సిద్దం అవుతున్నాడు. కృతి సనోన్ ఏమో 'బరేలి కి బర్ఫీ' కోసం రెడీ అవుతోంది. రాబ్తా కోసం ఇద్దరు బాగానే కష్టపడ్డారు కానీ.. మగధీరను కాపీ కొట్టి కొట్టలేదు అనడంతో.. సినిమా కూడా హిట్టవుతుందన్నంత కలరింగ్ ఇచ్చి ఇవ్వకుండా ఎగిరిపోయింది.