ఫోటో స్టోరి: కృతి అందాల బహుమతి

Update: 2018-01-19 05:09 GMT
అందమైన కళ్లు.. పొడుగైన కాళ్లు.. కవ్వించే చూపులు.. కైపెక్కించే సోకులు ఇవన్నీ పుష్కలంగా ఉన్న నార్త్ బ్యూటీ కృతి సనన్. యాక్టింగ్ తక్కువే అయినా గ్లామర్ ఎక్కువే ఉండటంతో సినిమాల్లో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఎంటరైన మొదటి సినిమాతో మహేష్ బాబు పక్కన 1 నేనొక్కడినే సినిమాలో సోలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో అమ్మడికి పెద్దగా కలిసిరాలేదు.

1 నేనొక్కడినే తరవాత బాలీవుడ్ కు మకాం మార్చేసి అక్కడ అవకాశాలు వెతుక్కోవడం మొదలెట్టింది. అమ్మడిలో స్పెషల్ అట్రాక్షన్ గ్లామరే కావడంతో తన స్పెషాలిటీ తెలిసేలా అప్పుడప్పుడు ఫొటోషూట్లు చేస్తోంది. రీసెంట్ గా డబ్బో క్యాలెండర్ కోసం కృతి ఇచ్చిన టాప్ లెస్ ఫోజు చూపరుల మతి పోగొట్టేసింది. కేవలం ఓ టోపీ అడ్డు పెట్టుకుని తన అందాలను కవర్ చేస్తూ కిర్రెక్కించే చూపుల్తో అమ్మడు ఇచ్చిన ఫోజును చూస్తే చలిలోనూ చెమటలు పట్టేయాల్సిందే. డబ్బో క్యాలెండర్ కోసం కృతి ఫోజులివ్వడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు రెండేళ్లు న్యూ ఇయర్ టైంలో విభిన్నమైన ఫోజుల్తో మత్తెక్కించింది. అవి బాగా పాపులరయ్యాయి కూడా. ఈసారి ఫోజు అందాల విందు మరింత పెంచుతూ ఫోజులిచ్చింది.

కృతిసనన్ కు సినిమాల్లో అభిమానులు పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఆమె ఫోజులకు దాసోహమైన అభిమాన గణం బాగానే ఉన్నారు. డబ్బో క్యాలెండర్ కోసం ఆమె గతంలో ఇచ్చిన ఫోజులతో ఇప్పటి ఫోజులను కంపేర్ చేస్తూ ఏది సెక్సీగా ఉందని డిస్కషన్లు కూడా పెట్టేశారు. అందాలన్నీ అచ్చుపోసిన ఆకృతి లాంటి కృతి ఫోజులను చూసి ఏది బెస్టో చెప్పమంటే కాస్త కష్టమే.
Tags:    

Similar News