లవ్వర్‌ను పప్పీలా తిప్పుకోలేను

Update: 2015-05-26 11:30 GMT
ప్రేమా గీమా జాన్తా నయ్‌. ప్రేమిస్తే టైమెక్కడిది? లవరుతో తిరిగేంత తీరిక నాకెక్కడిది? అయినా ఈరోజు ముంబైలో ఉంటే రేపు హైదరాబాద్‌లో ఉంటా. షూటింగుల కోసం ఊరూరా తిరుగుతుంటా. విదేశాలు చెక్కేస్తుంటా. అలాంటప్పుడు ప్రేమ దోమా అంటూ తిరిగేంత సమయం ఎక్కడ చిక్కుతుంది. అందుకే అలాంటి తొక్కలో కమిట్‌మెంట్స్‌ పెట్టుకోలేదని సెలవిస్తోంది కృతిసనోన్‌. ఊళ్లు పట్టుకు తిరిగేదాన్ని.. బోయ్‌ఫ్రెండ్‌ ఎందుకు? అంటూ సూటిగా ప్రశ్నిస్తోంది.

ఒకవేళ ప్రేమిస్తే నా లవరుని కూడా నాతో పాటే పప్పీలా తిప్పుకోవాల్సొస్తుంది. కేవలం నా సంతోషమేనా? తన సంతోషం అఖ్ఖర్లేదా? వన్‌సైడే ఆలోచించాలా? అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది కృతి. అంతేనా షూటింగుల కోసం విదేశాలు రాను. ప్రయాణాలు చేయను అని అంటే ఈ వృత్తిలో కుదరదు. మానుకుంటే ఉద్యోగం మానుకున్నట్టే. అప్పుడు సినిమాల్లోకి నన్నెవరు తీసుకుంటారు? ముంబైలో షూటింగులు పెట్టుకోండి అంటే కుదురుతుందా? అందుకే ఇవన్నీ ఆలోచించి ప్రేమలో పడలేదు.. అని చెబుతోంది ఈ గడుసరి భామ. 1నేనొక్కడినే, దోచెయ్‌ సినిమాలతో పెర్ఫామర్‌గా తెలుగువారిని మెప్పించిన ఈ భామ టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.

Tags:    

Similar News