మీటూ ని పలుచన చెయ్యోద్దంటున్న కృతి సనన్

Update: 2018-10-15 06:23 GMT
#మీటూ... మీటూ.. మీటూ.  అది స్టొరీ.  ఎక్కడైనా అదే స్టొరీ. మరి ఆరోపణలు వస్తే తప్పు చేసినట్టా? ఆరోపణలు రుజువైతే తప్పు చేసినట్టా? "మీరంటే నాకు ఇష్టం లేకపోతే ఒక ఫేక్ ఐడీ క్రియేట్ చేసి నన్ను తాకాడు.. గిల్లాడు.. నొక్కాడు..అంటే మీరు చెడ్డ ఐపోతారా?" మీటూ పై విమర్శలు చేసేవారి ప్రధాన విమర్శ ఇది.  ఎవరినైనా డీఫేమ్ చేసేందుకు లేదా కంపుగోట్టే బురద చల్లేందుకు మీటూ ను అడ్డం పెట్టుకుంటున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపై బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ఒకసారి ఆమె వ్యూ పాయింట్ చూడండి.

#మీటూ లో భాగంగా తమ జీవితం లో జరిగిన లైంగిక వేధింపుల సంఘటనలను బయటకు చెప్పుకోవడానికి ఒక అమ్మాయికి ఎంతో ధైర్యం అవసరం.  అలా ఎంతో ధైర్యంగా బయటకు వచ్చి #మీటూ స్టోరీస్ ని షేర్ చేసుకుంటున్న వారికి హ్యాట్స్ ఆఫ్.  ఇలా అందరూ ధైర్యంగా బయటకు చెప్పడానికి ముందుకు వస్తుండడంతో తప్పుడుపనులు చేసే వాళ్ళకు వెన్నులో వణుకు పుడుతోంది.  ఈ 'భయం' చాలా అవసరం.. అది ఇలాగే కొనసాగడం సమాజానికి మంచిది.  కానీ ఈ #మీటూ  ఉద్యమం పలుచన కాకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ఈ సందర్భంగా నా మనసులో మెదిలిన అలోచనను మీతో పంచుకుంటున్నాను."

"ఒక అజ్ఞాత మహిళ తన #మీటూ స్టొరీ ని సోషల్ మీడియా లో షేర్ చేసింది అనుకుందాం. అసలు ఆ అమ్మాయి ఎవరో.. అసలు ఆ అమ్మాయి ఉందో లేదో అసలు తెలియకుండా నమ్ముదామా?  ఇలాంటి సంఘటనలను ఎవరు విచారించగలరు?  ఇలాంటి సందర్భం లో ఎవరిపైనా అయినా ఆరోపణలు వస్తే వాళ్ళది 'తప్పు' అని ఎలా నమ్మగలం.  అసలు ఇలా  అజ్ఞాత వ్యక్తులు చెప్పే కథలను మీడియా కవర్ చెయ్యవచ్చా?  ఒక్క స్టొరీ ఇలా ఎవరిపైనైనా రాస్తే వారి రెప్యుటేషన్ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంది.  కాబట్టి మనం #మీటూ ను మరింత శ్రద్దగా... బాధ్యతతో ముందుకు తీసుకెళ్ళవలసి ఉంది.   ఇది చివరికి చట్టపరమైన దారిలో వెళ్తేనే ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉంది."

"నేను #మీటూ లో భాగంగా తమకు జరిగిన బాధకరమైన సంఘటనలు అందరితో పంచుకుంటున్న మహిళలు/పురుషులను  కోరేదొక్కటే. మీరు మీ రియల్ నేమ్.. ఐడెంటిటీ ని దాచిపెట్టి ఆరోపణలు చేయ వద్దు.  లేదా మీరు కేసు ఫైల్ చెయ్యండి.. చట్టపరంగా ముందుకు వెళ్ళండి(మీ ఐడెంటిటీ ని మీడియాకు ఇతరులకు తెలపవద్దని వారిని కోరవచ్చు.. దీనివల్ల మీ గోప్యతకు భంగం కలగదు).  ఇలా చేయడం వల్ల మీ కేసు పై కనీసం చట్టపరంగా విచారణ జరిపే అవకాశం ఉంటుంది. దీంతో #మీటూ మూవ్ మెంట్ ను మిస్యూజ్ చేయకుండా... డైల్యూట్ కాకుండా కాపాడగలం."
Tags:    

Similar News