మహేష్ హీరోయిన్ కి మోడీ ఎఫెక్ట్

Update: 2016-11-12 09:58 GMT
మహేష్ బాబుతో కలిసి 1 నేనొక్కడినే అంటూ టాలీవుడ్ లో సందడి చేసిన భామ కృతి సనోన్. ఇక్కడ చేసిన రెండు సినిమాలు ఫెయిల్ అవడంతో.. తన మకాం ముంబై మార్చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తతం బెరైలీ కీ బర్ఫీ అనే మూవీ షూటింగ్ లో ఉంది. లక్నోలో షూటింగ్ జరుగుతుండగా.. కృతిపై మోడీ ఎఫెక్ట్ గట్టిగానే పడింది.

హీరోయిన్ కి.. మోడీకి లింక్ ఏంటంటే.. లక్నో షూటింగ్ లో ఉన్నపుడు ఈమెకు తీవ్రంగా జ్వరం వచ్చేసింది. దగ్గు జలుబు విపరీతం అయిపోవడంతో.. ఒక దశలో స్పృహ తప్పి పడిపోయింది కూడా. దీంతో కృతి సనోన్ ను అప్పటికప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించడం ప్రారంభించారు. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే.. ఈమెకు డాక్టర్ రాసిన మెడిసిన్ ఇతర ఎక్విప్మెంట్ కొనేందుకు కొంత పెద్ద మొత్తంలోనే డబ్బులు కావాల్సి వచ్చిందట. కానీ అందరి దగ్గరా 500.. 1000 రూపాయల నోట్లే ఉన్నాయి. కార్డులతో పేమెంట్స్ చేసేంతగా అక్కడకు దగ్గర్లో సౌకర్యం లేదు. దీంతో యూనిట్ అంతా చందాలు వేసుకున్నా అమౌంట్ చాలలేదట.

'ఆ సమయంలో చౌక్ ప్రాంతంలో పెద్ద నోట్లకు చిన్ననోట్లను మార్చుకుంటారనే విషయం తెలిసింది. అక్కడికి వెళితే.. ప్రతీ 1000 నోటుకు.. 800 రూపాయలు ఇస్తున్నారు. అయినా సరే తగినంతగా నోట్లు మార్చుకుని కృతికి ట్రీట్మెంట్ అందించాం' అని బెరైలీ కి బర్ఫీ యూనిట్ చెబుతోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News