అందం .. అభినయంతో పాటు అదృష్టం కూడా పుష్కలంగా ఉన్న కథానాయిక కృతి శెట్టి అని చెప్పుకోవచ్చు. వరుసగా మూడు సినిమాలు చేసిన ఆమె, అవలీలగా హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతును కూడా బాగానే కూడగట్టింది.
ఇక ఇప్పుడు 'ది వారియర్' సినిమాతో ఆమె రెండో విడతను మొదలు పెట్టిందనే అనుకోవాలి. తమిళ దర్శకుడు లింగుసామి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. రామ్ జోడీగా ఆమె చేసిన ఈ సినిమా ఈ నెల 14వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో ప్రేక్షకులను పలకరించనుంది.
ఇంతవరకూ కృతి చేసిన సినిమాలలో ఒక్క 'బంగార్రాజు'లో కాస్త స్టెప్పులు వేసింది. మిగతా సినిమాల్లో అంత అవసరపడలేదు. పిల్ల చూస్తే ముద్దుగా .. ముద్దమందారంలా ఉందిగానీ, డాన్సులు బాగా చేస్తుందా అనే డౌటు జనానికి లేకపోలేదు.
ఆ సందేహాలకు ఈ సినిమాతో కృతి ఫుల్ స్టాప్ పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. రామ్ మంచి డాన్సర్ అనే విషయాన్ని కొత్తగా చెప్పవలసిన పని లేదు. ఆయన సినిమాల్లో ఆడియన్స్ ఆశించే స్థాయిలోనే డాన్సులు ఉంటాయి. ఆయనతో సమానంగానే కృతి డాన్సులు చేసిందనే విషయం 'బుల్లెట్' .. 'విజిల్' పాటల వలన తెలుస్తూనే ఉంది.
ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లలో కృతి బాగా డాన్స్ చేస్తోందని శేఖర్ మాస్టర్ కితాబు ఇవ్వడం విశేషం.కనుక ఈ సినిమాతో డాన్స్ పరంగా కూడా కృతి మంచి మార్కులు సంపాదించుకోవడం ఖాయంగా తెలుస్తోంది.
ఇక ఆ తరువాత ఆమె చేసిన సినిమా 'మాచర్ల నియోజక వర్గం'. ఆ సినిమా కూడా ఆగస్టు 12వ తేదీనే విడుదల కానుంది. చాలా తక్కువ గ్యాపులో కృతి నుంచి వస్తున్న సినిమాలు ఇవి. ఈ రెండు సినిమాలు హిట్ అయితే కృతి నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందనేది అందరూ అనుకుంటున్న మాట.