జ‌క్క‌న్న‌పై మ‌ళ్లీ విషం చిమ్మిన బాలీవుడ్ క్రిటిక్‌!

Update: 2022-11-12 13:30 GMT
'బాహుబ‌లి ది బిగినింగ్‌, బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ సినిమాల‌తో రాజ‌మౌళి ప్ర‌పంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్‌ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు చాటారు. అంతే కాకుండా తెలుగు సినిమాని శిఖ‌రాగ్రాల‌కు చేర్చి దేశం మొత్తం టాలీవుడ్ వైపు త‌లెత్తి చూసేలా చేశారు. ఆ త‌రువాత నుంచే బాలీవుడ్ సినిమాల‌కు గ‌డ్డు కాలం మొద‌లైంది. తెలుగులో ఏ సినిమా విడుద‌లైనా యావ‌త్ ఇండియా ఆస‌క్తిగా ఎదురుచూడ‌టం స్టార్ట‌యింది.

దీనిపై బాలీవుడ్ క్రిటిక్స్‌, మేక‌ర్స్ చాలా మంది విషం చిమ్ముతూనే వున్నారు. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా రాజ‌మౌళిని కార్న‌ర్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే వున్నారు. 'RRR' స‌మ‌యంలోనూ బాలీవుడ్ క్రిటిక్స్ అని చెప్పుకు తిరిగే కొంత మంది రాజ‌మౌళిని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది సినిమానా? అంటూ విషం చిమ్మారు. అందులో ప్ర‌ధానంగా ముందు వ‌రుస‌లో నిలిచిన వ్య‌క్త క‌మ‌ల్ ర‌షీద్ ఖాన్ (క‌మ‌ల్ ఆర్ ఖాన్‌). బాహుబ‌లి టైమ్ లోనూ రాజ‌మౌళిపై సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేసిన క‌మ‌ల్ ఆర్ ఖాన్ ఇటీవ‌ల 'RRR' రిలీజ్ స‌మ‌యంలోనూ ఇలాగే జ‌క్క‌న్న‌పై విరుచుకుప‌డి విమ‌ర్శ‌ల పాల‌య్యాడు.

తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ వీడియోని ట్వీట్ చేస్తూ 'బాహుబ‌లి' కాపీ అని ఇదే రాజ‌మౌళి కాపీ యూనివ‌ర్స్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ గా మారింది. హాలీవుడ్ కు సంబంధించిన 35 సినిమాల్లోని కీల‌క సీన్ ల‌ని లేపేసి 'బాహుబ‌లి'ని తెర‌కెక్కించాడంటూ విష‌యం క‌క్కాడు. 'బాహుబ‌లి'ని 35 హాలీవుడ్ సినిమాల సీన్ ల‌తో పోలుస్తూ ఓ వీడియోని షేర్ చేశాడు. దీనికి ఓ క్యాన్ష‌న్ ని కూడా జ‌త చేశాడు.

ఇది జీనియ‌స్ అన‌బ‌డే డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాపీ యూనివ‌ర్స్‌. ప్ర‌తీ స‌న్నివేశాన్ని ఫారిన్ సినిమాల నుంచి కాపీ కొడ‌తాడు' అంటూ విమ‌ర్శ‌లు చేయ‌డంతో నెట్టింట క‌మ‌ల్ ఆర్ ఖాన్ ని మ‌న నెటిజ‌న్ లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. 'పోకిరి' సినిమాలో ఆషీష్ విద్యార్ధిని ఉద్దేశించి 'మీ నాన్న నిరోద్ వాడాల్సింది అన‌వ‌స‌రంగా పుట్టావ్' అనే వీడియో డైలాగ్ ని షేర్ చేస్తూ క‌మ‌ల్ ఆర్ ఖాన్ కు చుక్క‌లు చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full ViewFull View
Tags:    

Similar News