ఎంపిక చేసుకునే కథ కంటెంట్ పాత్రలు సంగీతం ఇవన్నీ సమకుదిరితే కమర్షియల్ హంగుల పేరుతో నాశనం చేయకుండా సహజసిద్ధతకు ప్రాధాన్యతనిస్తే.. ఆ సినిమాకి అవార్డులు రివార్డులతో పాటు ప్రముఖుల నుంచి మన్ననలు దక్కుతాయి.
ఇప్పుడు అవార్డును మించిన రివార్డ్ అందుకుంది మలయాళ ఇండస్ట్రీ. ది గ్రేట్ తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్ నుంచే ప్రశంస దక్కించుకుంది. రెగ్యులర్ గా టాలీవుడ్ బాలీవుడ్ సహా అన్ని భాషల సినిమాల్ని వీక్షించే కేటీఆర్ ఈ లాక్ డౌన్ సీజన్ లో మలయాళ సినిమాలు వెబ్ సిరీస్ లు బాగా చూశారట. మల్లూ సినిమాపై గౌరవం పెరిగిందని అక్కడ సినిమాల నాణ్యత గొప్పగా ఉందని కితాబిచ్చేశారు.
ఓటీటీ వేదికపై మలయాళ చిత్రాలు చూశారట. పృథ్వీ రాజ్ కు పెద్ద అభిమాని అయ్యానని తెలిపిన ఆయనకు దుల్కర్ అంటే ఇష్టమని చెప్పాడు. ఫహద్ ఫాసిల్- నజ్రియా నజ్రిన్- పార్వతి మొదలైన వారి పేర్లను ప్రస్థావించారు. మలయాళ సినిమాలు మనం ఇతర భాషలతో పోలిస్తే రొటీనిటీకి భిన్నంగా ఉంటాయని ప్రశంసించారు. వెబ్ సిరీస్ లలో ‘ది అమెరికన్స్’.., ‘మోడరన్ ఫ్యామిలీ’..., ‘క్వీన్’ వంటి టీవీ షోలు కేటీఆర్ వీక్షించారట. తెలుగు సినిమాల్లో కమర్షియల్ హంగులపై సెటైర్లు వేసినా మన సినిమా గొప్పతనాన్ని పలుమార్లు ఆయన ప్రశంసించారు.