మంచి సినిమా తీయడంతో కలిగే ప్రయోజనాలే వేరు. ఆర్థికంగా ఎంత లాభం వచ్చిందనేది పక్కనపెడితే ఆ చిత్రంతో లభించే ప్రశంసలు మాత్రం మేకర్స్ కి వెలకట్టలేనంత సంతోషాన్ని కలిగిస్తుంటాయి. ఎప్పుడు ఎవరినుంచి ఎలాంటి ప్రశంసలు లభిస్తుంటాయో ఊహించలేం. కంచె సినిమాని తీసిన క్రిష్ కి కూడా ఆ సినిమా విషయంలో ఇప్పటికీ ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. మొదట విమర్శకులు మెచ్చుకొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకి జాతీయ అవార్డులు లభించాయి. ఆ సినిమా ఎప్పుడు టీవీల్లో ప్రదర్శితమైనా ఎవరో ఒకరు మెసేజ్ లు చేస్తూ అభినందిస్తుంటారట.
తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కి కూడా కంచె సినిమా నచ్చింది. సెలవురోజైన నిన్నటి ఆదివారాన్ని ఆయన టీవీలో వస్తున్న కంచె సినిమా చూస్తూ గడిపాడు. ఆ చిత్రం నచ్చడంతో వెంటనే ట్విట్టర్ ద్వారా యూనిట్ ని అభినందించాడు. దాంతో కథానాయకుడు వరుణ్ తేజ్ చాలా ఖుషీ అయ్యాడు. కేటీఆర్ అభిరుచిని కూడా అందరూ మెచ్చుకొంటున్నారు. పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సినిమాలకీ సమయం కేటాయిస్తూ ప్రోత్సహించడం అభినందనీయమని పరిశ్రమ వర్గాలు ఆయన్ని మెచ్చుకొంటున్నాయి. కేటీఆర్ కి కేవలం పాలిటిక్స్ పైనే కాదు, సినిమా క్రీడా రంగాలపైనా మంచి అవగాహన ఉంది. అందుకే ఆయనకి అన్ని రంగాల్లోనూ స్నేహితులున్నారు.