100% తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' లో ''కుడి ఎడమైతే'' అనే సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. అమలాపాల్ - రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ సిరీస్ ను జూలై 16 నుండి స్ట్రీమింగ్ పెడుతున్నారు. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ - టీజర్ ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో 'కుడి ఎడమైతే' నుంచి అమలా పాల్ పాత్రకు సంబంధించిన ఇంట్రడ్యూసింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
ఈ సిరీస్ లో అమలాపాల్ పోలీస్ ఆఫీసర్ దుర్గ పాత్రలో కనిపించనుంది. 'ఫిబ్రవరి 29.. నాలుగేళ్లకు ఒక్కసారి వస్తుంది. ఎవరు డిసైడ్ చేశారో కానీ..' అంటూ ప్రారంభమైన ఈ వీడియో ఆసక్తికరంగా సాగింది. 'నా పేరు దుర్గ. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ లో సీఐ ని.. ఇంకో నెల రోజుల్లో 9 ఏళ్ల సర్వీస్ పూర్తవుతుంది. నేను ఎప్పుడూ ఒంటరిగా ఉంటాను. కానీ నాకు ఒంటరిగా ఉండడం ఇష్టమా? లేక రియాల్టీస్ నుంచి దూరంగా ఉండటానికి ఇలా ఉంటున్నానా?' అని దుర్గ తనను ప్రశ్నించుకుంటూ ఉన్న ఈ వీడియో ఆకట్టుకుంటోంది.
''కుడి ఎడమైతే'' ఇండియాలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారం కానున్న తొలి సైంటిఫికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అని తెలుస్తోంది. ఇందులో రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ గా కనిపిస్తుండగా.. రవి ప్రకాష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 'లూసియా' 'యూ టర్న్' ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ని రామ్ విఘ్నేశ్ రూపొందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ మరియు పవన్ కుమార్ స్టూడియోస్ కలిసి ఈ సిరీస్ ని నిర్మించాయి. ఎమోషన్స్ - థ్రిల్స్ - సైంటిఫిక్ ఎలిమెంట్స్ కలబోసిన ఈ టైమ్ లూప్ క్రైమ్ థ్రిల్లర్ ఈ నెల 16న 'ఆహా' వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Full View