సుధీర్‌ బాబు బాడీ బిల్డింగ్ వెన‌క ఆ ట్రైన‌ర్ ఎవ‌రు?

Update: 2020-10-24 03:30 GMT
ఫిట్ నెస్ విష‌యంలో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కు.. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వ‌ర‌కు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తుంటారు. గ‌త కొన్నేళ్లుగా హాలీవుడ్ స్టార్స్ మాత్ర‌మే ఫిట్ నెస్ ‌కి కేరాఫ్ అడ్ర‌స్ ‌గా నిలిచే వారు కానీ క్ర‌మంగా అది బాలీవుడ్‌ లోనూ ఓ ట్రెండ్ ‌గా మారింది. వాళ్ల‌ని చూసి మ‌న వాళ్ల‌లో కూడా మార్పులు మొద‌ల‌య్యాయి.

సినిమాల్లో మాచో మెన్ ‌లుగా క‌నిపించ‌డం కోసం మ‌న‌వాళ్లు ఈ మ‌ధ్య ఫిట్ ‌నెస్ ‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. `బాహుబ‌లి` నుంచి టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ మ‌రీ ఎక్కువైపోయింది. ప్ర‌భాస్‌,... రానా, సుధీర్‌బాబు, .. ర‌కుల్‌, .. త‌మ‌న్నా లాంటి వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ట్రైన‌ర్స్ కూడా వున్నారు. ఎక్కువ‌గా వీరంతా ఒకే ఒక్క ట్రైన‌ర్ వ‌ద్ద ఫిట్ నెస్ పాఠాలు నేర్చుకుంటున్నారు. అత‌నే కునాల్ గిల్‌.

సుధీర్ ‌బాబు ఫిట్ నెస్ ర‌హ‌స్యం ఇత‌నే. బాలీవుడ్ ఫిల్మ్ `బాఘీ` విల‌న్‌గా క‌రుకుకండ‌ల‌తో సుధీర్ ‌బాబు అద‌ర‌గొట్టాడంటే దానికి కార‌ణం కునాల్ గిలే. ఇటీవ‌ల నానితో క‌లిసి న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ ‌టైన‌ర్‌ లోని ఓ ఫైట్ ‌లో సుధీర్‌ బాబు ష‌ర్ట్ లెస్‌ గా కండ‌లు చూపిస్తూ ఫైట్ ఇర‌గ‌దీశాడంటే దానికి కార‌ణం కునాల్ గిలే. సుధీర్ ‌బాబు బాడీబిల్డింగ్ వెన‌క వుంటూ అత‌న్ని మ్యాచోమెన్‌ గా చూపించ‌డంతో హండ్రెడ్ ప‌ర్సెంట్ స‌క్సెస్ అయ్యాడు. ప్ర‌స్తుతం కునాల్ గిల్‌ కి టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్‌ లోరూ క్రేజీ హీరోలు, హీరోయిన్‌ లు క్లైంట్‌ లుగా వున్నారు.
Tags:    

Similar News