చాలా పరిమితంగా ఉండే కన్నడ సినిమా స్థాయిలో అంతెత్తున నిలబెట్టిన కెజిఎఫ్ చాప్టర్ 1 గురించి శాండల్ వుడ్ మీడియా వర్గాలు ఇప్పటికీ కథనాలు రాస్తూనే ఉంటాయి. హిందీ వెర్షన్ సైతం బ్లాక్ బస్టర్ గా నిలిచి ఎవరు ఈ యష్ అని మాట్లాడుకునేలా చేయడం అంటే మాటలా. కంఠీరవ రాజ్ కుమార్ లాంటి దిగ్గజాలకే ఇది సాధ్యం కాలేదు. ఇటీవలి కాలంలో కన్నడలో భారీ చిత్రాల నిర్మాణం ఊపందుకుంది. అందులోనూ కెజిఎఫ్ ఇచ్చిన స్ఫూర్తితో వంద కోట్లు పెట్టుబడి పెట్టేందుకు పెద్ద సంస్థలు రెడీ అవుతున్నాయి.
అందులో భాగంగా వచ్చిందే మొన్న రిలీజైన కురుక్షేత్ర. కనివిని ఎరుగని స్థాయిలో కర్ణాటకలో భారీ ఓపెనింగ్స్ సాధించిన కురుక్షేత్ర ఫస్ట్ డే కెజిఎఫ్ వసూళ్లను సైతం దాటేసిందని అక్కడి ట్రేడ్ రిపోర్ట్. తెల్లవారుఝామున 3 గంటలతో మొదలుపెట్టిన షోలు రాష్ట్రవ్యాప్తంగా అలా మరుసటి రోజు దాకా సాగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే నెరేషన్ స్లోగా ఉండటం తెలిసిన కథే కావడం లాంటి కారణాల వల్ల ఫైనల్ రన్ లో కెజిఎఫ్ ని దాటే ఛాన్స్ లేనట్టే అని టాక్
ఇదిలా ఉండగా తెలుగులోనూ సమాంతరంగా రిలీజ్ అయిన డబ్బింగ్ వెర్షన్ కురుక్షేత్రంకు ఇక్కడ కనీస స్పందన లోపించింది. పబ్లిసిటీ లోపం వల్ల ఇదో సినిమా వచ్చిందనే సంగతి కూడా ఎక్కువ శాతం చేరలేకపోయింది. దీంతో చాలా వీక్ ఓపెనింగ్స్ వచ్చినట్టుగా వసూళ్ల లెక్కలు చెబుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ల లాంటి ఓ మాదిరి ప్రచారాలు చేసినా కొంత హెల్ప్ అయ్యేది కానీ అవేవి చేయలేదు. దీంతో మన్మథుడు 2 డివైడ్ టాక్ ని కురుక్షేత్ర ఏ మాత్రం వాడుకోలేకపోయింది. కెజిఎఫ్ పరిస్థితి ఇలా లేదు అప్పట్లో. అన్ని బాషల వెర్షన్లకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకే వంద కోట్ల మార్కుని ఈజీగా దాటేసింది. యష్ కురుక్షేత్ర హీరో దర్శన్ ల మధ్య స్టార్ వార్ గా భావిస్తున్న కన్నడనాట ఇప్పుడు దీని వసూళ్లను అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు