త్రివిక్రమ్ తప్పు చేయడంతే

Update: 2018-01-08 16:28 GMT
ఎవ్వరు ఎన్ని చెప్పినా ఎన్ని వివాదాలు చిచ్చులు రాజేసినా ప్రస్తుతం అందరి చూపు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాపైనే ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ అభిమానులనే కాకుండా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమాను చూడలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓపెన్ చేయగా అన్ని షోలో హౌస్ ఫుల్ అయ్యాయి. సినిమా మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోందా అని ప్రేక్షకులు ఆలోచిస్తుంటే చిత్ర యూనిట్ మాత్రం రిజల్ట్ ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కింది కాబట్టి తప్పకుండా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందని ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాలో పవన్ కళ్యాణ్ కు స్టెప్ మథర్ గా కనిపించనున్న కుష్బూ మాత్రం చాలా డిఫెరెంట్ ఫీలింగ్ తో ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఆమె రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా తన అనుభూతిని తెలియజేశారు.

#అజ్ఞాతవాసి జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అయితే ఒక పిల్లవాడు తన మొదటి రిపోర్ట్ కార్డ్ కోసం ఎదురుచూసిన విధంగా ఫీలింగ్ కలుగుతోంది. నా మదిలో సీతాకోకచిలుకలు అలజడి రేపుతున్నట్లు ఉంది. ఇక 10 సంవత్సరాల తరువాత తెలుగు తెరపై కనిపించబోతున్నా. ఆలస్యంగా వచ్చిన మంచి టైమ్ కె వచ్చాను. నా నమ్మకం ఏంటంటే.. త్రివిక్రమ్ తప్పు చేయడు. థాంక్యూ పవన్ కళ్యాణ్.. అని కుష్బూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కుష్బూ పదేళ్ల క్రితం మెగాస్టార్ స్టాలిన్ సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఆమె పవన్ సినిమాలో కనిపించనుంది.


Tags:    

Similar News