ప్రముఖ నటిగా మాత్రమే కాదు.. రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్న బహుభాష నటి ఖుష్బూ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వచ్చే నెల నాలుగున ఆమెకు సర్జరీ చేయనున్నారు. ఇటీవల కొద్ది కాలంగా ఆమెకు ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.
కొద్ది రోజుల క్రితం ఖుష్బూ ఇంట్లో జారి పడ్డారు. దీంతో ఆమె మోకాలికి దెబ్బ తగిలింది. ఈ గాయం తీవ్రత ఎక్కువ కావటంతో చికిత్స చేయించుకున్నారు. ఈ మధ్యనే రికవరీ అయ్యారు. అయితే.. ఉన్నట్లుండి కడుపులో నొప్పి రావటం మొదలైంది.
మళ్లీ వైద్యుల్ని సంప్రదించిన ఆమెకు.. పరీక్షలు నిర్వహించారు. చివరకు ఖుష్బూ కడుపులో చిన్న కణితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో.. ఆమెకు వెంటనే సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల (నవంబరు 4)న ఆమెకు సర్జరీని నిర్వహించనున్నారు. సర్జరీ అనంతరం కనీసం రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో నవంబరు 4.. 8..17 తేదీల్లో జరిగే ఇందిరాగాంధీ శతజయంతి వేడుకులకు హాజరు కాలేని పరిస్థితి. తమిళనాడు కాంగ్రెస్ నాయకురాలిగా.. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఖుష్బూ ఈ కార్యక్రమాలకు గైర్హాజరు కానున్నారు.