ఏం జరుగుతోంది.. అక్క మాజీ ప్రియుడితో చెల్లి!

Update: 2022-08-19 07:33 GMT
శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా పరిచయం కాకముందు నుండే సోషల్ మీడియా ద్వారా ఒక సెలబ్రిటీ హోదా ను దక్కించుకుంది. స్టార్‌ కిడ్ అవ్వడం వల్ల జాన్వీ కపూర్ ఏం చేస్తున్నా కూడా అంతా ఆసక్తిగా చూసేవారు. దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల క్రితం జాన్వీ కపూర్‌ ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా యొక్క ప్రీమియర్ షో కి అక్షత్ రంజన్ తో కలిసి హాజరు అయ్యింది.

ఆ సమయంలో వారిద్దరు చాలా క్లోజ్ గా ఉండటంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందని అంతా భావించారు. ఆ తర్వాత కూడా ఇద్దరూ పార్టీ లు పబ్‌ లు అంటూ తిరిగారు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ విషయమై అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది. మళ్లీ ఇప్పుడు అక్షత్‌ రంజన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

అయితే ఈసారి ఖుషీ కపూర్ కు అక్షత్‌ రంజన్ లవ్ యూ చెప్పడం తో టాపిక్ హాట్ గా మారింది. జాన్వీ కపూర్‌ సోదరి అయిన ఖుషి కపూర్ ఇటీవల ఆయనతో కలిసి ఉన్న ఫోటో ను షేర్‌ చేసింది. ఆ పోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలకు చాలా మంది చాలా కామెంట్స్ పెడుతున్నారు. అక్షయ్ స్పందిస్తూ ly అంటూ కామెంట్‌ చేశాడు. అంటే లవ్‌ యూ అని అర్థం అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అక్షత్ కామెంట్ కు ఖుషి కపూర్‌ ilu అంటూ రిప్లై ఇచ్చింది. అంటే ఐ లవ్‌ యూ అని అర్థం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇద్దరు కూడా ఇంత బాహాటంగా ఐ లవ్ యూ చెప్పుకోవడం చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య వ్యవహారం చాలా దూరం వెళ్లి ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో జాన్వీ కపూర్ తో రిలేషన్‌ లో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన అక్షత్ రంజన్ ఇప్పుడు ఆమె సోదరి ఖుషి కపూర్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇండస్ట్రీ లో ఇలాంటివి కామన్‌ అంటూ కొందరు లైట్ తీసుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఇలాంటి పద్దతి కరెక్ట్‌ కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వక ముందు నుండే పాపులారిటీని దక్కించుకున్న ఖుషి కపూర్‌ అతి త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న విషయం తెల్సిందే. వెబ్‌ సిరీస్ తో పాటు సినిమాల్లో వరుసగా ఈమె సినిమాను చేసేందుకు సిద్ధం అవుతోంది.
Tags:    

Similar News