ఒక సినిమా ద్వారా ఎవరన్నా పరిచయం అయితే.. ఖచ్చితంగా వారికి ఆ సినిమా పేరే ఇంటి పేరు తరహాలో మారిపోతుంది. అదిగో మన దగ్గర ఆహుతి ప్రసాద్ నుండి వెన్నెల కిషోర్ వరకు.. శుభలేఖ సుధాకర్ నుండి అల్లరి నరేష్ వరకు.. అందరూ అదే తరహా చట్రంలో ఉన్నారు. అయితే ఒక ఐటెం బాంబ్ మాత్రం.. నా తొలిసినిమాతో నన్ను లింక్ చేసి చూడకండి.. ఇప్పుడు చేస్తోందో నా తొలిసినిమా అంటోంది.
రావడం రావడమే తెలుగులో పాగా వేసుకోవాలని డిసైడై వచ్చినట్లు ఉంది బెంగాళి ముద్దుగుమ్మ కైరా దత్త. హిందీలో క్యాలెండర్ గాళ్స్ సినిమాతో పాపులర్ అయిన ఈ సుందరి.. తెలుగులో రేసుగుర్రం సినిమాలో ఓపెనింగ్ సాంగ్ బూచాడే బూచాడేలో నటించింది. ఇప్పుడు పైసా వసూల్ సినిమాతో ఏకంగా నటిగా డెబ్యూ చేస్తోంది. అయితే పైసా వసూల్ సినిమానే తన డెబ్యూ సినిమాగా పరిగణించాలని.. రేసుగుర్రంలో ఏదో డ్యాన్స్ నంబర్ సరదాకి చేసిందని.. ఆఫర్ వచ్చింది కాబట్టి ఒప్పుకున్నాను కాని.. నటిగా పూరి స్కూల్లో ఓనమాలు దిద్దుకుని ఇప్పుడే తెరంగేట్రం చేస్తున్నాను అంటోంది.
ఏదేమైనా కూడా ఐటెం సాంగ్స్ నుండి ఇప్పుడు ఒక ముఖ్యమైన క్యారక్టర్ చేసేవరకు వచ్చిన ఈ అమ్మాయి హీరోయిన్ అవుతుందో లేదో తెలియదు కాని.. ఆమె అందచందాలు చూస్తే ముమాయత్ ఖాన్ తరహాలో తిష్టేసేలా ఉంది. ఆల్రెడీ బాలయ్యను పొగిడేస్తూ సినిమా లవ్వర్స్ కు బాగానే దగ్గరైపోయింది. చూద్దాం సెప్టెంబర్ 1న ఈమె ఫేట్ ఎలా మారబోతుందో!!