ఆమె ఒక బెంగాళీ బ్యూటి. మోడలింగ్ లో ఇరగదీసింది. చాలా చాలా సెక్సీ యాడ్స్ లో ఆమె సెక్సీ లుక్ చూపరులకు మత్తెక్కించింది. అందుకే ఆమెకు సౌత్ ఫిలిం ఇండస్ర్టీ వెంటనే ఛాన్సులు ఇచ్చింది. కాకపోతే సెక్సీ ఉన్నవారికి సావిత్రి పాత్రలు మనోళ్ళు ఇవ్వరుగా.. ఆమెకు తమిళ సినిమాల్లో ఐటెం సాంగులు చేసే ఛాన్సొచ్చింది. అక్కడి నుండి తెలుగులో కూడా 'రేసు గుర్రం' సినిమాలో బూచాడే బూచాడే అంటూ లయబద్దంగా తన ఒంపుసొంపులను నాట్యం చేయిస్తూ.. తెలుగులో కూడా ఫేమస్ అయ్యింది ఐటెం బాంబ్ కైరా దత్.
'కేలండర్ గాళ్స్' సినిమాతో బాలీవుడ్ లో కూడా పాపులర్ అయిన ఈ హాటీ.. ఇప్పుడు తెలుగులో 'పైసా వసూల్' సినమాలో నటిస్తోంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కాదు కాని.. ఒక ఐటెం సాంగుతో పాటు కొన్ని సీన్లలో కూడా కనిపించే రోల్ చేస్తోంది. అయితే ఇప్పుడు కైరా తను ఈ సినిమా గురించి ఎక్కడ మాట్లాడినా కూడా బాలయ్య గురించి అమ్మడు పేజీలు పేజీలు చెప్పేస్తోంది. ''ఆయన చాలా ప్రొఫెషనల్. బాలీవుడ్ లో కూడా ఇలాంటివారిని చూడలేదు. ఎంతో గౌరవం ఇస్తారు. అంతే కాదు.. నాతో తెలుగు బాగా మాట్లాడించింది కూడా ఆయన. డైలాగుల్లో ఎక్కడ ఆపాలి ఎక్కడ ఎక్స్ ప్రెషన్ చెప్పాలి అనేది స్వయంగా చెప్పేవారు. ఆయన వలనే డైలాగ్స్ చాలా బాగా చెప్పాను'' అంటూ బాలయ్య గురించి పెద్ద లిస్టే చదివేసింది కైరా.
పూరి జగన్ డైరక్షన్లో రూపొందుతున్న 'పైసా వసూల్' సినిమాలో ఇప్పటివరకు శ్రీయ సరన్.. కైరా దత్ లు షూటింగులో పాల్గొన్నారు. అయితే మరో హీరోయిన్ ముస్కాన్ సేథి మెయిన్ లీడ్ అంటూ అప్పట్లో పూరి జగన్ ప్రకటించాడు మరి. ఆమెతో షూటింగ్ ఎప్పుడు చేస్తారు అనేది చూడాలింకా. త్వరలో పైసా వసూల్ టీజర్ రిలీజవ్వబోతోంది.