కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్ - మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కామ్రెడ్ సిద్ధ గా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చిరుకి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ కి జోడీగా పూజాహెగ్డే కనిపించనుంది. సమ్మర్ కానుకగా మే 13న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘లాహే లాహే’ అనే పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'కొండలరాజు బంగరుకొండ.. కొండజాతికి అండ.. మద్దెరాతిరి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే..' అంటూ సాగిన ఈ పాటకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఫోక్ మెలోడీ స్టైల్ లో ట్యూన్ అందించాడు. 'మెళ్ళో మెలికల నాగుల దండ.. వలపుల వేడికి ఎగిరిపడంగా.. ఒంటి విభూది జారి రాలిపడంగా..' అంటూ అర్ధనారీశ్వర ప్రేమలీలను తెలియజేసే విధంగా లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సింగర్స్ హారిక నారాయణ్ - సాహితి చాగంటి ఈ పాటను ఆలపించారు. ప్రత్యేకంగా వేసిన టెంపుల్ టౌన్ సెట్ లో దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ షూట్ చేయబడింది.
ఇందులో సీనియర్ నటి సంగీత సంప్రదాయ వస్త్రధారణలో పాట డ్యాన్స్ చేయడం స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు. మధ్యలో చిరంజీవి వేసిన స్టెప్స్ అలరిస్తున్నాయి. చిరు మునుపటిలా అదే ఎనర్జీతో గ్రేస్ తో స్టైలిష్ గా డ్యాన్స్ చేసాడు. చిరంజీవి - మణిశర్మ ఎవర్ గ్రీన్ కాంబినేషన్లో మరో మంచి సాంగ్ వచ్చిందని చెప్పవచ్చు. దీనికి సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించగా.. సినిమాటోగ్రాఫర్ తిరు అద్భుతమైన విజువల్స్ అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.
Full View