ఆల్రెడీ హీరో సూర్యపై ఇద్దరు ఫుట్ బాల్ ప్లేయర్లు కేసు పెడుతున్నారు అనే విషయం మనకు తెలిసిందే. సోమవారం సాయంత్రం.. అడయార్ ఏరియాలో.. పొరపాటను ఒక కార్ సడన్ బ్రేక్ వేయడంతో.. వెనుకే మోటర్ సైకిల్ పై వస్తున్న ఫుట్ బాల్ ప్లేయర్లు కారును ఢీకొట్టారు. అయితే అలా అర్ధంపర్ధం లేకుండా డ్రైవ్ చేస్తావా అంటూ వారు ఆమెను నిలదీశారు కూడా. వీరి మధ్యన వాగ్వివాదం జరుగుతుండగా.. అటుగా వెళ్తున్న హీరో సూర్య చూసి.. అమ్మాయిని ఏడిపిస్తారా అంటూ ఒక యువకుడిని చెంప దెబ్బ కొట్టారట. అది ఆ ఫుట్ బాల్ ప్లేయర్ల ఆరోపణ. ఇక మంగళవారం సాయంత్రానికి ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
ఇంకా పోలీసులు ఎఫ.ఐ.ఆర్ వంటిది ఏమీ రిజిష్టర్ చేయలేదు కాని.. సదరు యువకుడు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి తన కేసును ఉపసంహరించుకున్నాడు. ఇక విషయం ఏంటంటే.. అసలు సూర్య ఆ యువకుల (ఫుట్ బాల్ ప్లేయర్స్)పై చేయెత్తలేదని యాక్సిడెంట్ కు కారణం అంటున్న సదరు అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్ లో చెప్పిందట. అసలు ఆ లేడీ ఎవ్వరో ఎవ్వరికీ తెలియదు కాని.. టివిల్లో చూసి ఆమె స్వయంగా సాక్ష్యం చెప్పడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చిందట. అవసరమైతే ప్రెస్ మీట్ పెట్టిమరీ జరిగిన విషయం ఏంటో జనాలకు చెబుతానని అంటోంది. బైక్ మీద వచ్చిన వ్యక్తులకు కావాలంటే బైక్ రిపేర్ కు డబ్బులు ఇస్తానన్నా.. తనని దుర్భాషలాడారని ఆమె చెప్పడం విశేషం.