బన్నీ- అమీర్-లింక్ ఏంటి

Update: 2018-01-05 06:47 GMT
విలక్షణమైన పాత్రలు పోషిస్తూ తమలో నటుడికి ఛాలెంజ్ విసురుతూ ప్రయోగాలు చేసే హీరోలు మన దగ్గర తక్కువే అనుకుంటాం కాని మనవాళ్ళ ఆలోచనా ధోరణి క్రమక్రమంగా మారుతోందని వాళ్ళు ఎంచుకుంటున్న సబ్జెక్ట్స్ ని చూస్తే అర్థమవుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో ముందు వరసలో ఉండే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ డిజే సినిమా విషయంలో రొటీన్ కంటెంట్ తో బన్నీ కూడా మూసలోకి వెళ్తున్నాడు అనే కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న స్టైలిష్ స్టార్ ఈ సారి మాత్రం నా పేరు సూర్య తో కథ పరంగా - తన ఫిజిక్ పరంగా - డైరెక్టర్ పరంగా అన్ని రకాలుగా రిస్క్ తీసుకోవడానికి సిద్ధ పడ్డాడు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు అనేది టీజర్ లో స్పష్టంగా కనిపించింది కూడా. జుత్తు కురచగా కత్తిరించుకుని - కఠినమైన అవుట్ ఫిట్స్ వర్క్ అవుట్ చేసి దేశభక్తి నిలువెల్లా నిండిన సిన్సియర్ మిలిటరీ ఆఫీసర్ గా తనను తాను మార్చుకున్న తీరుకు ఇతర హీరోలు కూడా ఆశ్చర్యపోయారు.

దీని గురించి ఒక మీడియా ఇంటర్వ్యూ లో ప్రస్తావించిన నిర్మాత లగడపాటి శ్రీధర్ అమీర్ ఖాన్ తర్వాత అంతటి డెడికేషన్ ఉన్న నటుడు ఈ తరంలో తనకు అల్లు అర్జున్ లోనే కనిపిస్తున్నాడు అని చెప్పడం బన్నీ కమిట్మెంట్ ఏ రేంజ్ లో ఉందో చెప్పకనే చెబుతోంది. బన్నీ కేవలం పాత్ర పరంగా మాత్రమే కాకుండా నా పేరు సూర్య సినిమాకు సంబంధించి అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అతని హార్డ్ వర్క్ కి నిదర్శనమని చెప్పాడు. గతంలో వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయడానికి సంశయించి కాస్త ఆలస్యం చేసిన జూనియర్ ఎన్టీఆర్ కూడా టీజర్ చూసి వంశీ పనితనం - బన్నీ హార్డ్ వర్క్ కి ఇద్దరినీ మనస్పూర్తిగా మెచ్చుకున్నట్టు వచ్చిన వార్త విని ఫాన్స్ దటీజ్ బన్నీ అంటున్నారు. దీని తర్వాత కూడా విఐ ఆనంద్ - మరో కొత్త దర్శకుడు ఇద్దరిలో ఒకటి ఓకే చేయబోతున్న బన్నీ గురించి ఆలోచిస్తే అమీర్ ఖాన్ తో పోలికే సబబే అనిపిస్తుంది. 
Tags:    

Similar News