భరతా? సూర్యానా?-ఏంటీ సస్పెన్స్

Update: 2018-01-05 07:51 GMT
టాలీవుడ్ లో ఒకే రోజు సినిమాలు విడుదల కావడం కొత్తేమి కాదు కాని ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల విషయంలో అలాంటి క్లాష్ కనిపించలేదు. కాని ఏప్రిల్ 27వ తేది అలాంటి ఆసక్తికరమైన పోటీకి వేదిక అయ్యేలా కనిపిస్తోంది. ఈ రోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత లగడపాటి శ్రీధర్ చాలా స్పష్టంగా నా పేరు సూర్య విడుదల తేది గురించి ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో తమ సినిమా ఏప్రిల్ 27 వచ్చేస్తుందని చెప్పేసారు. కాని ఇదే డేట్ గతంలో మహేష్ బాబు-కొరటాల శివ కాంబోలో వస్తున్న భరత్ అను నేనుకి కూడా ప్రకటించారు. దీని గురించి గతంలో నా పేరు సూర్య సహ నిర్మాత బన్నీ వాసు పబ్లిక్ గానే తన అసహనం వ్యక్తం చేసారు. రెండు సినిమాల నిర్మాతలం కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుంటామన్న శ్రీధర్ తాము మాత్రం 27 కే కట్టుబడి ఉంటామని చెప్పడం విశేషం.

రోబో 2.0 ఏప్రిల్ 13న రావడంలో ఇక ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కాబట్టి ఇప్పుడు భరత్, సూర్యలో ఎవరు ముందు వెళ్తారు అనేది సస్పెన్స్ గా మారింది. లగడపాటి శ్రీధర్ చెప్పిన ప్రకారం నా పేరు సూర్య 27నే వస్తుంది అంటున్నారు. అయినా కూడా భరత్ అను నేను నిర్మాతలతో కూడా చర్చిస్తాం అని అన్నారు. అది జరిగాక ఏమైనా కీలక మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. నా పేరు సూర్య ట్రైలర్ ని ఇంత త్వరగా విడుదల చేయడానికి కారణం కూడా ప్లానింగ్ ప్రకారం అన్ని పూర్తి చేసి చెప్పిన డేట్ కి విడుదల చేసే ప్రయత్నంలో భాగమే కావొచ్చు. భరత్ అను నేను షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ ఇంకా మీడియాకు అందుబాటులోకి రావడం లేదు. నా పేరు సూర్య ప్రమోషన్ మాత్రం స్టార్ట్ చేసారు. రానున్న రోజుల్లో భరత్ అను నేను యూనిట్ స్పందించే దాకా స్పష్టత వచ్చే అవకాశం లేదు.
Tags:    

Similar News