బాలయ్య రియల్‌ ఐరెన్‌ మన్‌ అంటూ కితాబిచ్చింది

Update: 2019-09-25 16:27 GMT
నందమూరి బాలకృష్ణ తన 105వ చిత్రాన్ని కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం షూటింగ్‌ ఇటీవల బ్యాంకాక్‌ లో చేశారు. బాలకృష్ణ మరియు సోనాల్‌ చౌహాన్‌ లపై పాట మరియు కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. ఆ సమయంలో బాలయ్యను సీనియర్‌ క్యూట్‌ హీరోయిన్‌ లైలా కలిసింది. గతంలో బాలకృష్ణతో ఆమె 'పవిత్ర ప్రేమ' చిత్రంలో నటించింది. ఇద్దరు కలిసి నటించిన కారణంగా తాజాగా బ్యాంకాక్‌ లో కలిసిన సందర్బంగా ఆనందం వ్యక్తం చేసింది.

బాలకృష్ణ మరియు సోనాల్‌ చౌహాన్‌ లతో కలిసి లైలా ఫొటోకు ఫోజ్‌ ఇచ్చింది. ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన లైలా.. ఈ ఫొటోను రీసెంట్‌ గా తీసుకున్నాను. ఈ ఫొటోను కొందరితో షేర్‌ చేసుకున్నప్పుడు బాలకృష్ణ గారిని చూస్తుంటే ఐరెన్‌ మన్‌ లా అనిపిస్తున్నారంటూ కామెంట్‌ చేశారు. నిజంగానే ఆయన ఐరెన్‌ మ్యాన్‌.. రియల్‌ లైఫ్‌ లో కూడా ఆయన ఐరెన్‌ మన్‌ అంటూ లైల్‌  పోస్ట్‌ చేసింది.

బాలకృష్ణ గారితో 'పవిత్ర ప్రేమ' చిత్రంను చేశాను. ఆ సినిమా షూటింగ్‌ అరకులో చేస్తున్న సమయంలో ఉదయం 3 గంటలకు లేచి జాగింగ్‌ కు వెళ్లే వారు. అక్కడ ఆయన్ను కలిసేందుకు వచ్చిన వారితో చాలా ఓపికగా మాట్లాడేవారు. బాలకృష్ణ గారు అక్కడున్నప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు వచ్చే వారంటూ లైలా పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంది. ఒకప్పుడు హీరోయిన్‌ గా పలు చిత్రాల్లో నటించిన లైలా కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి పూర్తి దూరం అయ్యింది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆమె రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి.

Tags:    

Similar News