బహుముఖ ప్రజ్నాశాలి మంచు లక్ష్మీ ప్రసన్న హీరోయిన్ గా కూడా అప్పుడప్పుడూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పటిదాకా ఆమెకు సరైన రిజల్ట్ రాలేదు. ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న ‘గుండెల్లో గోదారి’.. ‘దొంగాట’ సినిమాలు ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ‘దొంగాట’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆమె నటించిన సినిమా ‘లక్ష్మీ బాంబు’. ఇంతకుముందు ప్రియమణి.. జగపతిబాబు ప్రధాన పాత్రల్లో ‘సాధ్యం’ అనే సినిమా తీసిన కార్తికేయ గోపాలకృష్ణ రూపొందించిన సినిమా ఇది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు నోచుకోవడం లేదు.
అప్పుడెప్పుడో దీపావళికే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామన్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత రెండు మూడు డేట్లు అనుకున్నారు. అవీ వెళ్లిపోయాయి. చివరికి ఫిబ్రవరి 3కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కానీ ఆ రోజు కూడా సినిమా విడుదల కాలేదు. ఈ సినిమాకు అనుకున్నట్లుగా బిజినెస్ జరక్కపోవడం.. థియేటర్లు దక్కకపోవడంతోనే సినిమా వాయిదా పడుతున్నట్లు సమాచారం. లక్ష్మి గత సినిమా ‘దొంగాట’ లాగా జనాల్లో ఇదేమంత ఆసక్తిని రేకెత్తించలేకపోయింది. దీంతో సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. మంచు లక్ష్మికి పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఈ సినిమా విడుదలకు నోచుకోకపోవడం ఆశ్చర్యమే. ఈ చిత్రంలో క్లైమాక్స్ ఫైట్ కొరియోగ్రాఫ్ చేసింది లక్ష్మి తమ్ముడు మంచు మనోజ్ కావడం విశేషం. ఇందులో లక్ష్మి జడ్జి పాత్రలో నటించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/