లక్ష్మి గణపతి ఫిలింస్‌.. అయ్యో!!

Update: 2015-11-16 19:30 GMT
లక్ష్మీ గణపతి ఫిలింస్.. దెయ్యాల కోట... లక్ష్మీ గణపతీ ఫిలింస్.. కొరివి దెయ్యం... ఇలాంటి ప్రకటనలు ఓ ఏడాది క్రితం వరకూ తెలుగు టీవీ ప్రేక్షకులకు బాగా వినిపించేవి. పెద్ద వాయిస్ తో.. హై పిచ్ సౌండ్ తో వినిపించే ఈ ప్రకటనలు విభిన్నంగా ఉండడమే కాదు.. బాగా ఆకట్టుకునేవి. ఈ మధ్య ఈ యాడ్స్ అసలు వినిపించడం లేదు. దీనికి కారణం సూపర్ స్టార్ అంటే నమ్మగలరా. కానీ ఇది  నిజమే.

లక్ష్మీ గణపతి ఫిలింస్ అధినేత బి.సుబ్రమణ్యం.. ఒకటీ అరా స్ట్రయిట్ మూవీస్ చేసినా ఎక్కువగా డబ్బింగ్ సినిమాలపైనే ఆధారపడేవాడు. వాటికి ప్రెజర్ తక్కువగా ఉండడం, యాక్టివిటీ కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉండకపోవడం కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే.. ఈయన ఓ మూవీ దెబ్బకి సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయాడు. అదే సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కొచ్చాడయాన్. సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్య ఈ మూవీ డైరెక్టర్. ఈ మూవీ తెలుగు వెర్షన్ విక్రమ సింహ కోసం భారీ మొత్తంలో డబ్బులు చెల్లించుకుని మొత్తం నష్టపోయాడు సుబ్రమణ్యం. అదికూడా మొత్తమేమీ కాదు. ఏకంగా 12 కోట్లు.. ఆ నిర్మాతల దగ్గర నుంచి రావాల్సి ఉంది.

కొచ్చాడయాన్ నిర్మాతల నుంచి తనుకు డబ్బులు వస్తాయనే ఆశిస్తున్నాడు ఈయన. నమ్మకం ఉందని కూడా చెబ్తాడు. అయితే.. ఎప్పుడు తిరిగొస్తాయనే విషయంపై మాత్రం సుబ్రమణ్యంకు కూడా క్లారిటీ లేదు. తనకు ఆ మొత్తం తిరిగొచ్చేవరకూ సినిమా నిర్మాణం చేయబోనని శపథం చేశాడట సుబ్రమణ్యం. అనేక మూవీస్ చేసి, తన బ్యానర్ కు ఓ వాల్యూూ సంపాదించిపెట్టిన ఇంత పెద్ద నిర్మాతను..  సూపర్ స్టార్ సినిమా ముంచేయడం దారుణమైన విషయమే. ఈ అంశంపై కనీసం రజినీకాంత్ అయినా స్పందించి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News