ఓన్లీ ఆ ముగ్గురు హీరోయిన్లేనా??

Update: 2018-03-27 04:41 GMT
మీడియా అంటే ఒకప్పుడు గౌరవం తో పాటు బయంగాను ఉండేది. ముఖ్యంగా తారలు మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో పరిస్థితి అలా లేదు. ఇష్టం వచ్చినట్లుగా మీడియా వాళ్లు మితిమీరిన ప్రవర్తనను చూపిస్తుండడంతో సామాన్యుడి నుంచి సెలబ్రేటి వరకు అందరు ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా ఓ న్యూస్ ఛానల్ వ్యాఖ్యాతపై కూడా తెలుగు చిత్ర పరిశ్రమ పోరాటం చేస్తూ.. కౌంటర్లు ఇస్తున్నారు. ఒక్కసారిగా వారి ఐక్యతను కూడా చూపించారు.

నటిమణులను టార్గెట్ చేస్తూ.. అసభ్యకరంగా కామెంట్ చేయడంతో సినీ ప్రముఖులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియా ద్వారా నటీనటులు కూడా వివాదంపై స్పందించారు. మంచు లక్ష్మి ప్రసన్న అందరికంటే ముందే హెచ్చరిక చేశారు. అంత ఈజీగా వదలమని చెప్పారు. అదే తరహాలో ఆమె సోదరుడు మంచి మనోజ్ కూడా కౌంటర్ ఇచ్చాడు. అతడు కనిపిస్తే పళ్లు రాల గోడతా మీరు కూడా అలానే చేయండి అంటూ అభిమానులకు చెప్పారు.

ఇక రకుల్ కూడా తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది. జర్నలిస్టు అని చెప్పుకోవడాని అతను సిగ్గుపడాలి. నటీనటులను టార్గెట్ చేస్తూ..  అసభ్యంగా మాట్లాడుతూ.. చర్చల పేరుతో ఇలా లాభాలను పొందుతున్నారు. నిజంగా ఇది దారుణమైన పరిణామం అని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇక అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి కూడా తన ట్వీట్ తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నేను ఈ ఒక్క విషయంపై మాట్లాడడం లేదు. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. సిగ్గుపడాల్సిన చండాలమైన విషయం. మహిళల్ని అవమానించే విధంగా కొందరు ఇలాంటి దారులను ఎంచుకున్నారని ఆమె ట్వీట్ చేశారు.

అంతా బాగానే ఉంది కాని.. అసలు కేవలం ఇలా ముగ్గురు హీరోయిన్లు మాత్రమే స్పందిస్తారా? దాదాపు టాలీవుడ్ అంతటినీ కలిపి తిడితే.. ఇలా మనోళ్ళు నిమ్మకు నీరెత్తనట్లు ఉంటే.. కొందరే స్పందిస్తే.. అసలు విషయంపై సీరియస్ నెస్ కాని.. లేదంటే సదరు జర్నలిస్టు తిట్లకు ఫీలవుతున్నట్లు కానీ అనిపించదు. చూద్దాం మనోళ్ళు ఏం చేస్తారో!!


Tags:    

Similar News