తాజాగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ పై పాకిస్థాన్ చిరస్మరణీయ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఇప్పటివరకు భారత్ పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదన్న అపప్రదను తొలగిస్తూ పాక్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాక్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇక, ఇమ్రాన్ ఖాన్ మొదలు సర్ఫరాజ్ అహమ్మద్ వరకు ఏ కెప్టెన్ కు సాధ్యం కాని ఘనత దక్కించుకొని పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓవర్ నైట్ లో హీరో అయిపోయాడు.
పాక్ లోని మాజీ క్రికెటర్లు మొదలు క్రికెట్ అభిమానులంతా బాబర్ ఆజమ్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇటువంటి సమయంలో బాబర్ ఆజమ్ పై అతడి స్నేహితురాలు హమీదా ముక్తర్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ఆజమ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకుని వదిలేసి మోసం చేశాడని షాకింగ్ ఆరోపణలు చేసింది. ఆజమ్ కారణంగా తాను తల్లి కాబోయానని, కానీ, అతడు అబార్షన్ చేయించుకోవాలని బలవంతపెట్టడంతో అబార్షన్ చేయించుకున్నానని ఆరోపించింది.
అంతేకాదు, ఆజమ్ తనను మోసం చేసినందుకుగాను లాహోర్ హైకోర్టులో కేసు కూడా వేశానని, ఆ తర్వాత ఈ వ్యవహారం సెటిల్ చేసుకునేందుకు ఆజమ్ కుటుంబం తనకు రూ. 20 లక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చిందని ఆరోపించింది. తాను, ఆజమ్ కలిసి చదువుకున్నామని, అతడు తనను లైంగిక వేధించి, ఆర్థికంగానూ మోసం చేశాడని ఆమె ఆరోపించినట్లు పాక్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.
తాను, బాబర్ ఆజమ్ ప్రేమించుకొని 2011లో ఇంటి నుంచి పారిపోయామని, ఆజమ్ స్నేహితుల ఇంట్లో కొద్ది రోజులున్నామని చెబుతోంది. అంతేకాదు, ఆజమ్ తో వెళ్లిపోయే ముందు తాను ఇంట్లో నుంచి రూ. 2 లక్షల విలువైన నగలను కూడా దొంగలించానని తెలిపింది. బాబర్ ఆజమ్ కోసం తాను కారును కూడా అమ్మేసి రూ. 12 లక్షలు ఇచ్చానని చెప్పుకొచ్చింది. బాబర్ ఆజమ్ తో కలిసి దిగిన ఫొటోలను కూడా హమీదా మీడియాకు చూపించింది. మరి, ఈ వ్యవహారంపై బాబర్ ఆజమ్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, బాబర్ ఆజమ్ పాక్ కెప్టెన్ అయిన సందర్భంలోనూ హమీదా ఈ తరహా ఆరోపణలతో వార్తల్లో నిలిచింది.