ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీలో విడుదలకు నోచుకోని లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం అనూహ్యంగా ఏపీలో విడుదలైంది. ముందు నుంచి చెబుతున్నట్లే ఏపీలో మే 1న విడుదల చేస్తామని చెప్పిన దానికి తగ్గట్లే కడప నగరంలో ఈ సినిమాను రెండు థియేటర్ లలో మార్నింగ్ షో వేశారు.
అయితే.. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. ఆయా థియేటర్లకు ఫోన్లు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం మీద ఉన్న పరిమితుల దృష్ట్యా ఎలా షో వేస్తారని ప్రశ్నించారు. దీంతో.. రెండు థియేటర్లలో రిలీజ్ అయిన మూవీని తర్వాత షోల నుంచి నిలిపివేశారు.
కడప నగరంలోని రాజా థియేటర్లోనూ.. పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని విడుదల చేశారు. ఈ రెండు చోట్ల మినహా ఏపీలో మరెక్కడా సినిమా విడుదల కాలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ.. రెండు థియేటర్లలో సినిమాను ఎలా రిలీజ్ చేశారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.