యంగ్ హీరో నాగ శౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం `లక్ష్య` అనే క్రీడా నేపథ్య చిత్రంలో నటిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నారాయణదాస్ కె. నారంగ్- పుస్కూర్ రామ్ మోహన్ రావు.. శరత్ మరార్ నిర్మిస్తున్నారు. చిత్ర బృందం తాజాగా కొత్తపోస్టర్ ను విడుదల చేసింది. స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్ గా రిలీజైన ఈ పోస్టర్ అంతర్జాలంలో వైరల్ గా దూసుకెళుతోంది.
ఈ చిత్రంలో పార్ధు అనే క్రీడాకారుడి పాత్రలో శౌర్య కనిపిస్తారు. ఈ పాత్ర కోసం అతడు పూర్తిగా రూపం మార్చాడు. రియల్ క్రీడాకారుడిలా లుక్ ని తీర్చిదిద్దాడు. దీనికోసం జిమ్ లో తీవ్రంగానే శ్రమించారు శౌర్య. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో అతడు ఒక స్టేడియంలో నిలబడి ఇండియా బ్లూజెర్సీ (పార్థు ఇండియా 11) ధరించి కనిపిస్తున్నాడు. పోస్టర్ లో సిసలైన ఆటగాడికి మరో రూపంలా ఉన్నాడు. చేతిలో బాణాలు గురిపెట్టేందుకు అస్త్రాల్ని రెడీ చేసుకుని అర్జునుడిలా కనిపిస్తున్నాడు.
నరాలు మెలితిరిగిన హ్యాండ్ తో కనిపిస్తున్నాడు. షర్ట్ విప్పితే అతడి రూపం అంతే స్పోర్ట్ లుక్ తో ఫిట్ గా కనిపించడం ఖాయం. ఈ రూపం కోసం టోన్డ్ లుక్ కోసం జిమ్ లో ఎంత కష్టపడ్డాడో ఊహించవచ్చు. ప్రస్తుతం ఇండిపెండెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేసిన పోస్టర్ అంతర్జాలంలో వైరల్ గా దూసుకెళుతోంది. ఇంతకీ శౌర్య అర్జునుడా? అభిమన్యుడా? ఆర్చరీలో ఆరితేరిన మొనగాడినని నిరూపిస్తాడా? కాస్త ఆగితే కానీ తెలియదు.