బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా డిసెంబర్ 11న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఆ తేదీ కోసం అమీర్ ఖాన్ అభిమానులతో పాటు మొత్తం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమీర్ ఖాన్ ప్రతి సినిమా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
అందుకే ఈ సినిమా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అంచనాలు అందుకునేలా ఆయన చేసి ఉంటాడని అభిమానులు నమ్ముతున్నారు. అందుకే డిసెంబర్ 11న సినిమా ను చూడటం కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తి అవ్వని కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
లాల్ సింగ్ చద్దా సినిమా 2021 లో లేదని తేలిపోయింది. ఈ సినిమా వల్ల కొన్ని సినిమాల విడుదల సందిగ్దలంలో పడ్డట్లయ్యింది. ఇప్పుడు అమీర్ ఖాన్ సైడ్ అవ్వడంతో మళ్లీ చర్చ మొదలు అయ్యింది.
పుష్ప సినిమా వచ్చే నెలలోనే విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. కొన్ని కారణాల వల్ల హిందీ వర్షన్ ను థియేట్రికల్ రిలీజ్ చేయలేక పోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై అధికారికంగా క్లారిటీ ఏమీ రాలేదు.. కాని ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారు.
ఒక వేళ నిజంగానే పుష్ప సినిమా హిందీ వర్షన్ రిలీజ్ కు సమస్యలు ఉన్నట్లు అయితే ఇప్పుడు లాల్ సింగ్ చద్దా సినిమా వాయిదా తో పుష్ప కు లైన్ క్లీయర్ అయినట్లే అంటూ కొందరు భావిస్తున్నారు. అమీర్ ఖాన్ మూవీ విడుదల లేని కారణంగా పుష్ప వస్తుందని ఉత్తరాది అల్లు అర్జున్ అభిమానులు భావిస్తున్నారు. అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమాను భారీ ఎత్తున మొదటి నుండి ప్రమోట్ చేస్తూ వచ్చారు.
తీరా విడుదల తేదీ దగ్గర పడ్డ సమయంలో హిందీ వర్షన్ లేదనే వార్తలు అభిమానులకు కాస్త ఇబ్బందిని కలిగించాయి. తాజాగా లాల్ సింగ్ చద్దా వాయిదా వారికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.
అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా లో మన అక్కినేని హీరో నాగ చైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. డిసెంబర్ నుండి తప్పుకున్న లాల్ సింగ్ చద్దా విడుదల వచ్చే సమ్మర్ లో ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ఏప్రిల్ లో ఒక మంచి తేదీని చూసి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఏప్రిల్ లో పలు తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా ఉన్నాయి. మరి అప్పుడు ఎంతగా రచ్చ జరుగనుందో చూడాలి. ఇక పుష్ప విషయానికి వస్తే బన్నీ మాస్ లుక్ సుకుమార్ సూపర్ టేకింగ్ తో పాటు విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా సునీల్.. ఫాహద్ ఫాజిల్.. అనసూయలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదల అయిన పాటలు సినిమా సక్సెస్ ను ఖరారు చేశాయంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.