గురుడు నెంబ‌ర్ -10? వీళ్లంతా సుస్మితాసేన్ మాజీలే!

Update: 2022-07-16 13:30 GMT
బాలీవుడ్ న‌టి..మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్ -ల‌లిత్ మోదీతో డేటింగ్ నేప‌థ్యంలో ఒక్క‌సారిగా  హాట్ టాపిక్ గా మారిన స‌ సంగ‌తి తెలిసిందే. ఇలాంటి మీడియా సెన్షేష‌న్స్ సుస్మిత‌కి కొత్తేం కాదు. నిత్యం ఎఫైర్ల‌తో హాట్ టాపిక్ అవ్వ‌డం అమ్మ‌డికి  అల‌వాటైన ప‌నే. అయితే ఈసారి ఏకంగా సుస్మిత‌-లలిత్ పెళ్లి చేసుకుంటామ‌ని ప్ర‌క‌టించ‌డంతోనే మ‌రింత ఆస‌క్తి సంత‌రించుకుంది.

ఇలాంటి వార్త చెబితే జ‌నాలు ఏమైపోతారు? అనుకున్నారో ఏమో! ఆ త‌ర్వాత కాసేప‌టికి  పెళ్లి అనే ఆలోచ‌న‌ని నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు  ప్ర‌క‌టించి అంద‌ర్నీ కూల్ చేసారు. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేయ‌డం ఆపై విడిపోవ‌డం సుస్మిత‌కు బాగా అల‌వాటైన ప‌ని. ఇప్ప‌టికే 9 మందికి బైబైచెప్పి ఇప్పుడు 10 వాడిగా ఏకంగా త‌న‌క‌న్నా 12 ఏళ్లు వాడు పెద్ద‌వాడైన‌ ల‌లిత్ మోదీని లైన్ లోకి తీసుకొచ్చింది.  ఈనేప‌థ్యంలో సుస్మిత పాత ల‌వ్ స్టోరీలు ఒక్క‌సారిగా త‌వ్వితీయ‌డం మీడియా ప‌నైంది. ఓ సారి ఆ పాత ప్రేమ‌క‌థ‌ల్లోకి వెళ్తే..  

విశ్వ సుందరి కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది సుష్మితా సేన్‌. అందాల పోటీల తర్వాత సుష్మితా నేరుగా సినిమా రంగంలోకి  ఇచ్చింది. అలా స్టార్‌ హీరోయిన్‌గా అంచ‌లంచెలుగా ఎదిగింది. సుస్మిత‌ అందానికి.. నటనకు ప్రేక్షకులతో పాటు ఓ క్రికెటర్‌.. నటులు..బడా వ్యాపారవేత్తలు కూడా ఫిదా అయ్యారు. ఈ క్రమంలో సుష్మితా పలువురితో ప్రేమాయ‌ణం నెరిపింది.

నిన్న‌..మొన్న‌టి వ‌ర‌కూ  తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్‌ రోహ్మాన్‌ షాల్‌తోంది డేటింగ్ చేసింది. దాదాపు  మూడేళ్ల పాటు  ఇద్ద‌రు క‌లిసి జీవనం సాగించారు. ఆ త‌ర్వాత మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్త‌డంతో విడిపోయారు. అంత‌కు ముందు పాకిస్తాన్ క్రికెట‌ర్ వసీమ్‌ అక్రమ్ తో కొన్నాళ్ల పాటు రిలేష‌న్ షిప్ లో ఉన్న‌ట్లు అప్ప‌ట్లో కథ‌నాలు వెలువ‌డ్డాయి.

ఆ త‌ర్వాత‌న బాలీవుడ్ న‌టుడు రణ్‌దీప్‌ హుడా- డైరెక్టర్‌ విక్రమ్‌ భట్‌-  ముద్దాసిర్‌- మానవ్‌ మీనన్‌లతో కొన్నేళ్ల పాటు జీవితాన్ని పంచ‌కున్న‌ట్లు మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి.  బడా వ్యాపారవేత్తలైన రితిక్‌ ఖాసిన్‌.. సబీర్‌.. సంజయ్‌ నారంగ్‌.. ఇంతియాజ్‌లతో  అమ్మ‌డు డేటింగ్  చేసింద‌న్న‌ది బ‌హిర్గ‌త‌మే.

మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కూ దాదాపు తొమ్మిది మందితో సుస్మిత  రిలేష‌న్ షిప్ మెయింటెన్ చేసి వాళ్ల‌కి బ్రేక‌ప్ చెప్పింది. ఇప్పుడు 10 వాడిగా లలిత్ మోడీ రేసులో నిలిచారు. ల‌లిత్ మోదీ- సుస్మిత క‌న్నా 12 ఏళ్లు వ‌య‌సులో పెద్ద‌వాడు. ప్రస్తుతం సుష్మితా వయసు 46 కాగా.. లలిత్‌ మోదీ వయసు 56 ఏళ్లు. సుస్మిత ఇద్ద‌రు పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకుంది.

ఇక లలిత్ మోదీకి ఇప్ప‌టికే పెళ్లి అయింది. ఆయ‌న త‌న‌కంటే తొమ్మిదేళ్లు  పెద్ద‌దైన నైజీరియాకి  మినాల్‌ సంగ్రాణి ని పెళ్లి చేసుకున్నారు. లలిత్ కుటుంబ స‌భ్యుల‌కు ఇష్టం లేకుండా ఆ పెళ్లి జ‌ర‌గ‌డంతో ..ఆఘ‌ట‌న త‌ర్వాత మోదీ త‌న కుటుంబానికే దూర‌మయ్యారు. అయితే మినాల్ కి అప్ప‌టికే ఓ పెళ్లి జ‌రిగింది. ఆమెకి పిల్ల‌లు కూడా ఉన్నారు.

భ‌ర్త ఓ కేసులో ఇరుక్కుని జైలు పాలు అవ్వ‌డంతో విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత  మినాల్ మోదీకి ద‌గ్గ‌రైంది. ప‌రిచ‌యం స్నేహంగా..ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కూ దారి తీసింది.  లిలత్ మోదీ-మీనాల్ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు.  అయితే మినాల్ క్యాన్స‌ర్ తో 2018 లో మృతి చెందారు. అప్ప‌టి నుంచి  ల‌లిత్ మోదీ ఒంట‌రిగానే ఉంటున్నారు. ఆయ‌న ఒంట‌రి త‌నానికి ఇప్పుడు సుస్మిత తోడుగా నిలుస్తుంది.
Tags:    

Similar News