ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ పై భూమి తీసుకొని మోసం చేసిన కేసు దాఖలైంది. తన దగ్గర స్థలం తీసుకొని మోసం చేశారంటూ భూమి యజమాని ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో.. 41ఏ సెక్షన్ కింద నోటీసులు జారీచేసిన సీఐడీ అధికారులు.. గురువారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
అయితే. సీఐడీ ఇచ్చిన నోటీసులపై మురళీ మోహన్, అతని కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మురళీ మోహన్ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు.
సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మార్చారని వాదించారు. సదరు వ్యక్తితో జయభేరి ప్రాపర్టీస్ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ఏ మాత్రం ఉల్లంఘించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం.. ఈ కేసులో సీఐడీ తీసుకోదలచని తదుపరి చర్యలు నిలిపేయాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో.. మురళీ మోహన్ కుటుంబానికి ఊరట లభించినట్టైంది.