గాన కోకిల లతా మంగేష్కర్ క్రికెట్ ని ఎంతగా ఇష్టపడేవారే చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలో జరిగే ప్రతీ మ్యాచ్ ని ఎంతో ఇష్టంతో వీక్షించేవారు. ఆ ఇష్టంతోనే ఆర్ధికంగా వెనుకబడి ఉన్న రోజుల్లో బీసీసీఐ కి ఆర్ధిక సహాయం చేసారు. యువ ప్రతిభను ప్రోత్సహించాలని అందుకోసం తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె చెప్పేవారు.
అంతగా క్రికెట్ లతాజీని ప్రభావితం చేసింది. మరి క్రికెట్ ఆటనే కాదు..ఆ ఆట ఆడే ఓ వ్యక్తితో లతాజీ ప్రేమలో పడిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు? ఇష్టపడిన క్రికెటర్ ని లతాజీ ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు? వంటి అంశాలు తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
రాజస్థాన్ దుంగార్ పూర్ సంస్థానాధీశుడు లక్ష్మణ్ దుంగార్ పూర్ కుమారుడు రాజ్ సింగ్ దుంగార్ పూర్ తో నే లతాజీ ప్రేమలో పడ్డారు. అతను మంచి రంజీ ప్లేయర్. బీసీసీఐకి అధ్యక్షుడిగాను పనిచేసాడు. లతాజీ ఫ్యామిలీ అంతా క్రికెట్ అభిమానులు కావడంతో లతాజీ సోదరుడు హృదయనాధ్ మంగేష్కర్ కి రాజాసింగ్ స్నేహితుడయ్యారు. అలా లతాజీ కుటుంబంలో రాజాసింగ్ ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయారు.
అప్పుడే లతాజీ రాజాసింగ్ ని ఇష్టపడ్డారు. కానీ రాజాసింగ్ కుటుంబం లతాజీ తో పెళ్లికి అంగీకరించలేదు. రాజకుటుంబానికి లతాజీ కోడలు ఎలా అవుతుందని అడ్డు తగలడంతో వాళ్ల ప్రేమకు పుల్ స్టాప్ పడింది. ఈ విషయం రాజాసింగ్ తండ్రికి నచ్చలేదు. లతాజీనే కోడలుగా భావించే వారు. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. ఈ అంశాలన్నింటిని `ది ప్లేస్ ఆఫ్ క్లౌడ్స్` అనే పుస్తకంలో రాజాసింగ్ మేనకోడలు రాజ శ్రీ కుమారి రివీల్ చేసారు.
అయితే ఇవన్నీ అవాస్తవాలని వయసు రీత్యా ఇద్దరి మధ్య వ్యత్యాసం కారణంగానే పెళ్లి జరగలేదన్నది కొందరి వాదన. ఇక లతాజీ ఇంట్లో పరిస్థితులు ఇందుకు భిన్నం. అప్పటికే లతాజీ చెల్లులు ఆశా భోంస్లే పెళ్లి విషయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు లతాజీని వెనక్కి లాగిపెట్టాయి. ఆ కారణంగాను లతాజీ జీవితాంతం అవివాహితగానే ఉండిపోయారని చెబుతుంటారు.
అయితే ఈ ప్రేమ వివాహాన్ని ఏనాడు లతాజీ గానీ..రాజాసింగ్ గానీ ధృవీకరించలేదు. ఇద్దరి సన్నిహితులు..స్నేహితులు చెప్పడం తప్ప అసలైన వాలళ్లు స్పందించింది లేదు. అయితే లార్స్డ్ మైదానంలో రాజా సింగ్ లతాజీ కోసం పర్మినెంట్ గా ఓ సీటు రిజర్వ్ చేసారని ఓ ఇంటర్వ్యూలో లతాజీని అడగగా అలాంటి లేదని నవ్వేసారు. ఓ సామాన్య ప్రేక్షకుల్లాగే క్రికెట్ ని ఆస్వాదించేదాన్ని అని లతాజీ తెలిపారు.