మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులే కాకుండా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. బైకు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిమితంగానే ఉంది. తాజాగా సాయిధరమ్ కు చేసిన 'కాలర్ బోన్ సర్జరీ’ కూడా సక్సెస్ అయ్యింది. అయితే ఇంకొన్ని రోజులు సాయిధరమ్ తేజ్ వెంటిలేటర్ మీదే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పేశారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో మెగా ఫ్యామిలీ తీసుకుంటున్న జాగ్రత్తలు అందరికీ తెలిసిందే..
శుక్రవారం రాత్రి సాయిధరమ్ తేజ్ తన బైక్ స్కిడ్ అవ్వడం వల్ల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దగ్గరలో మెడికవర్ హాస్పిటల్ కు తరలించడం.. అక్కడ గోల్డెన్ అవర్ లోనే సరైన చికిత్స అందించడంతో సాయిధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చారు. మెరుగైన వైద్యం కోసం సాయిధరమ్ తేజ్ ను అపోలో ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు.
తాజాగా అపోలో యాజమాన్యం సోమవారం సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. 'సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇంకా కొన్ని రోజులు ఐసీయూలోనే ఉంచాల్సి ఉంది. వెంటిలేటర్ మద్దతుతో ప్రక్రియను తొలగించడం ప్రారంభించామని' చెప్పేశారు.
ఇక మరోవైపు సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు.