పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే హడావుడి.. ఆయన అభిమానుల్లో మాత్రమే కాకుండా మొత్తం సినిమా పరిశ్రమలో కూడా హడావుడి వాతావరణం కనిపిస్తుంది. సినిమా వారం ముందు నుండే బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. థియేటర్ బుకింగ్స్ మొదలుకుని అడ్వాన్స్ బుకింగ్స్ వరకు అంతా హంగామాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినా కూడా ఆయన సినిమాల్లో సత్తా తగ్గలేదు అని వకీల్ సాబ్ నిరూపించింది.
రాజకీయాలతో సంబంధం లేకుండా పవన్ సినిమాను అభిమానించే వారు కోట్ల మంది ఉంటారు. అందుకే భీమ్లా నాయక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డులు సృష్టిస్తున్నాయి. ట్రైలర్ విడుదల అవ్వక ముందు యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయ్యింది. ట్రైలర్ కంటే ముందే అడ్వాన్స్ బుకింగ్ మొదలు అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. ట్రైలర్ కూడా చూడకుండా ఏకంగా మూడు లక్షల డాలర్ల అడ్వాన్స్ బుకింగ్ యూఎస్ లో జరిగింది.
విడుదలకు మరో రెండు రోజులు ఉండగానే కేవలం ప్రీమియర్ ల ద్వారా నాలుగు లక్షల డాలర్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టింది. ఇతర షో లకు మరో లక్ష డాలర్లు వసూళ్లు అయ్యాయి. విడుదల సమయం వరకు ఈ మొత్తం భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రీమియర్ లతోనే మిలియన్ డాలర్లను వసూళ్లు చేసే అవకాశం ఉందంటూ ట్రేడ్ పండితులు చాలా నమ్మకంతో చెబుతున్నారు.
విడుదల కాకుండానే యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు భీమ్లా నాయక్ లాభాలను తెచ్చి పెట్టేలా ఉన్నాడంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన భీమ్లా నాయక్ సినిమా తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంది. దాంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్.. స్టార్ డమ్ ఇసుమంత కూడా తగ్గలేదు అని దీన్ని బట్టి అర్థం అవుతుంది.. ఈ అడ్వాన్స్ బుకింగ్ ఇందుకు సాక్ష్యం అన్నట్లుగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్ నటించగా కీలక పాత్రలో రానా నటించాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కు రచన సహకారం ను త్రివిక్రమ్ అందించాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా ఈ సినిమా రూపొందిన విషయం తెల్సిందే.
పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ట్రైలర్ విడుదల అయిన తర్వాత సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కనుక వసూళ్లు అదే రేంజ్ లో ఉంటాయనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.