భీమ్లా గురించి భవదీయుడు చేసిన ట్వీట్స్ పిచ్చెక్కిస్తున్నాయి

Update: 2022-02-25 08:31 GMT
ఎక్కడ చూసినా భీమ్లా నాయక్‌ సందడి కనిపిస్తుంది. దాదాపు ఏడాది కాలంగా అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్‌ సినిమా అంచనాలకు తగ్గట్లుగా ఉందంటూ రివ్యూలు వస్తున్నాయి. అభిమానులు సినిమా అదిరిపోయిందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే రివ్యూవర్స్ కూడా మంచి రేటింగ్‌ ఇస్తూ సినిమా పై సాదారణ ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెంచేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమా అంటే స్టార్స్.. సెలబ్రెటీలు అంతా కూడా చిన్న పిల్లల మాదిరిగా మారిపోయి తమ అభిమాన హీరో అంటూ థియేటర్ల ముందు బారులు తీరడం కనిపిస్తూ ఉంటుంది. అలా ఎంతో మంది స్టార్స్ మరియు సెలబ్రెటీలు మొదటి రోజు మొదటి ఆట భీమ్లా నాయక్ ను చూశారు. అందరు కూడా చాలా ఉత్సాహంగా సినిమా గురించి ట్వీట్‌ లు చేస్తూ ఉన్నారు. తాజాగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ చేసిన ట్వీట్స్ అభిమానులకు పిచ్చెక్కించేవిగా ఉన్నాయి.

హరీష్ శంకర్ ట్విట్టర్‌ లో మూడు ట్వీట్స్ ను చేశాడు. పవన్‌ కళ్యాణ్‌ మరోసారి అద్బుతమైన పాత్రలో చూడటం సంతోషం. సాగర్ కే చంద్ర మరియు త్రివిక్రమ్‌ గారు అద్బుతమైన పనితనం. నిర్మాత నాగ వంశీ కి మరియు టీమ్‌ అందరికి కంగ్రాట్స్. స్పెషల్‌ గా థమన్ గురించి చెప్పాలి.

బావా ఇది నీ కెరీర్‌ బెస్ట్‌ వర్క్‌. ప్రతి ఒక్క సన్నివేశంను కూడా ఎంజాయ్ చేశాను. నీవు సన్నివేశాలను అర్థం చేసుకున్న తీరు అద్బుతం. ఇది కేవలం బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ మాత్రమే కాదు.. ఇది బ్యాక్ బోన్‌ ఆఫ్ భీమ్లా నాయక్. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బావ అంటూ ట్వీట్‌ చేశాడు.

మరో ట్వీట్‌ లో హరీష్ శంకర్‌ డానియల్‌ శేఖర్ గా నటించిన రానా గురించి హరీష్ శంకర్‌ ప్రస్థావించాడు. సినిమాలో రానా కాకుండా డానియల్ శేఖర్ మాత్రమే కనిపించాడు. దీని తర్వాత రానా నీ ఫ్యాన్స్ వెయిటింగ్‌ ఇక్కడ అంటూ ట్వీట్‌ చేశాడు. రానా మరియు పవన్ కళ్యాణ్ ల మద్య వచ్చే ప్రతి ఒక్క సన్నివేశం కూడా అభిమానులను మరియు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తుంది.

మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు అంటూ సాగర్‌ చంద్ర మరియు త్రివిక్రమ్‌ ల పై ప్రశంసల వర్షం కురుస్తోంది. త్రివిక్రమ్‌ ప్రతి సన్నివేశంలో కూడా అద్బుతమైన డైలాగ్స్ రాశాడు. ఆయన గతంలో పవన్ తో తీసిన అజ్ఞాతవాసి ప్లాప్‌కు ఈ సినిమా తో బదులు తీర్చుకున్నట్లుగా ఉందని.. అంత కసి ఆయన లో కనిపించిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా లో స్టార్స్... సెలబ్రెటీల ట్వీట్స్ తో మరింతగా భీమ్లా నాయక్‌  కోసం అభిమానులు పిచ్చెక్కి పోతున్నారు. ఇదే జోరు తో రాబోయే వారం పది రోజుల పాటు వసూళ్ల వర్షం కురవడం ఖాయం.
Tags:    

Similar News