'భీమ్లానాయ‌క్' లో.... అస‌లుకి మించి ఏముంది?

Update: 2022-02-25 12:30 GMT
గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మ‌ల‌యాళ చిత్రాలు చాలా వ‌ర‌కు బ్యాక్ టు బ్యాక్ తెలుగులో రీమేక్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఏ హీరోని క‌దిపినా మ‌ల‌యాళ రీమేక్ గురించే మాట్లాడుతున్నారు. అందులో మ‌రీ ప్ర‌ధానంగా మెగా హీరోలిద్ద‌రూ మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ల‌ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఒక‌రు మెగాస్టార్ చిరంజీవి. మ‌రొక‌రు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. మెగాస్టార్ చిరంజీవి మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `లూసీఫ‌ర్‌` ఆధారంగా రూపొందుతున్న `గాడ్ ఫాద‌ర్‌`లో న‌టిస్తున్నారు. ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

చిరుకి ముందే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ల‌యాళ హిట్ చిత్రం ఆధారంగా రూపొందిన చిత్రంలో న‌టించారు. అదే `భీమ్లానాయ‌క్‌`. పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, బీజు మీన‌న్ హీరోలుగా న‌టించారు. మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ మూవీ ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన `భీమ్లానాయ‌క్‌` ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది.

ఈ నేప‌థ్యంలో నెట్టింట ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. మలమాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్పనుమ్ కోషియుమ్‌` ఆధారంగా రూపొందిన `భీమ్లానాయ‌క్‌` యాజిటీజ్ గా వుందా? మూల‌క‌థ‌ని మాత్ర‌మే తీసుకుని కొత్త‌గా చేశారా? అని ప్రేక్ష‌కుల్లో ఓ టాపిక్ వైర‌ల్ గా మారింది. సాధార‌ణంగా ఏ సినిమాని అయినా తెలుగులో రీమేక్ చేస్తే దాన్ని యాజిటీజ్ గా కాకుండా తెలుగు నేటివిటీకి అనుగునంగా మార్పులు చేర్పులు చేస్తుంటారు. క‌థని, క‌థ‌నాన్ని మార్చేస్తుంటారు, కొంత మందైతే మూల‌క‌థ‌ని మాత్ర‌మే తీసుకుని కొత్త సీన్ ల‌ని యాడ్ చేస్తుంటారు. కొందరైతే క‌థ‌, క‌థ‌నాల్ని మార్చ‌కుండా క్యారెక్ట‌ర్ల‌ని మ‌రింత హైలైట్ చేస్తూ మార్చేస్తుంటారు.

`భీమ్లానాయ‌క్‌` విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టార్ డ‌మ్ ని దృష్టిలో పెట్టుకుని ఒరిజిన‌ల్ చిత్రంలో బీజు మీన‌న్ పోషించిన పాత్ర‌ని మ‌రింత హైలైట్ చేస్తూ పాత్ర‌ల‌కున్న ప్రాధాన్య‌త‌ని మార్చారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఒరిజిన‌ల్ లో హీరో.. తెలుగుకు వ‌చ్చే స‌రికి విల‌న్ ఛాల‌కు మార్చేశారు. ఆ పాత్ర‌ని రానా చేశారు. `వ‌కీల్ సాబ్‌` చిత్రాన్ని ప‌వ‌న్ ఇమేజ్ కి అనుగునంగా మార్చి చేశారు. అదే త‌ర‌హాలో `భీమ్లానాయ‌క్‌` ని కూడా మార్చేసి ప‌వ‌న్ సినిమాగా తెర‌పైకి తెచ్చారు.

ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని `పింక్‌` రీమేక్ లో మార్పులు చేసి హీరో పాత్ర‌కు ప్రాధాన్య‌త పెంచార‌ని ఆ త‌రువాత విమ‌ర్శ‌లు కూడా వినిపించాయి. `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` చాలా స్లోగా సాగుతుంది. అంతే కాకుండా కోషీ పాత్ర‌కే అందులో అధిక ప్రాధాన్య‌త వుంటుంది. కానీ తెలుగులోకి వ‌చ్చేసరికి అవ‌న్నీ మార్చేశారు. రానా పాత్ర‌కి ప్రాధాన్య‌త త‌గ్గించి ప‌వ‌న్ పాత్ర‌ని బాగా ఎలివేట్ చేశారు. మ‌ల‌యాళంలో ఇద్ద‌రిని ఉద్దేశించి టైటిల్ వుంటే తెలుగులో మాత్రం ప‌వ‌న్ సినిమాగా మార్చేశారు. మొత్తానికి విలన్ పాత్ర‌ని హీరోగా.. హీరో పాత్ర‌ని విల‌న్ గా తిప్పి మార్చేశారు.

దీంతో సినిమా క్రేజ్ ఓ రేంజ్ వెళ్లిపోయింది. ప‌వ‌న్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌రుండి మ‌రీ ఈ మార్పులు చేయించారు. మ‌ల‌యాళం చిత్రం చూసిన వారికి ఎక్క‌డెక్క‌డ మార్పులు చేశారో.. ఎవి లేపేశారో క్లారిటీగా తెలుస్తుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే ప‌వ‌న్ ఫ్యాన్స్ కి మాత్రం `భీమ్లా నాయ‌క్‌` భీభ‌త్పంగా న‌చ్చేసింది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు మోత మోగించ‌డం మొద‌లుపెట్టింది.
Tags:    

Similar News