కళ్లు చెదిరే బైక్ రేసింగ్ విన్యాసాలతో వలీమై ట్రైలర్ కట్టి పడేసిన సంగతి తెలిసిందే. రోడ్ల పై రయ్ మంటూ దూసుకెళ్లే గ్యాంగ్.. గాల్లో పల్టీలు కొట్టిస్తూ .. ఎదుటివారిని బురిడీలు కొట్టిస్తూ కార్తికేయ అండ్ గ్యాంగ్ ఆడే ఆట గగుర్పొడిచేలా కనిపించింది. అయితే ఇంతటి ప్రతిభా పాటవం ఎలా సాధ్యమైంది. నిజానికి బైక్ రేసింగ్ లో కార్తికేయకు ఆ రేంజు ఉందా? అంటే.. ఎస్.. ఉందని చెబుతున్నాడు ఈ యువహీరో. అయితే అథ్లెటిక్స్ రేసింగ్ లో ప్రావీణ్యం ఉన్న తళా అజిత్ నుంచి తాను టిప్స్ తీసుకున్నానని కూడా కార్తికేయ గుమ్మడి కొండ తెలిపారు.
`గ్యాంగ్ లీడర్` చిత్రంలో బైక్ ఛేజింగ్ రోల్ తో ఆకట్టుకున్న కార్తికేయ గుమ్మకొండ మరోసారి వలీమై చిత్రంలో అంతకుమించి అనేలా రేసర్ కం గ్యాంగ్ స్టర్ గా అడ్వెంచరస్ పాత్రతో మెరిపించనున్నాడు. అతడి పాత్ర ఈ చిత్రంలో అజిత్ తో పోటీపడుతూ కనిపించనుంది. అజిత్ కాప్ పాత్రలో నటిస్తుండగా.. కార్తికేయ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న పలు భాషల్లో విడుదల కానుంది.
తాజా ఇంటర్వ్యూలో కార్తికేయ ఆశ్చర్యపోయే ఎన్నో విషయాల్ని తెలిపారు. ``అజిత్ సార్ ఒక ప్రొఫెషనల్ రేసర్.. ఛేజింగ్ సన్నివేశాలలో అతనితో కలిసి పని చేయడం అద్భుతమైన శిక్షణా అనుభవం. నేను అతని నుండి బైక్ రేసింగ్ చిట్కాలను తీసుకున్నాను. అతను వంటతో సహా తన ఇతర అభిరుచుల గురించి కూడా మాతో మాట్లాడేవారు`` అని యువ నటుడు చెప్పారు.
వలీమై చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. అతడు పూర్తి ప్రొఫెషనల్ అంటూ పొగిడేశారు కార్తికేయ. ఇంత భారీ బడ్జెట్ చిత్రంలో పనిచేయడం ఇదే మొదటిసారి అని చెప్పాడు. అజిత్ సర్ కి దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. హీరోగా అవకాశాలొస్తున్నా విలన్ పాత్ర పోషించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని కూడా కార్తికేయ అన్నారు.
``వలీమైలో నా పాత్ర నాకు చాలా నచ్చింది. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ కాబట్టి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు సినిమాను ఆస్వాధిస్తారని నేను ఆశిస్తున్నాను`` అని కార్తికేయ తెలిపారు. ఈ చిత్రంలో హుమా ఖురేషి ప్రధాన నాయికగా కనిపించనుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా... నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు. వాలిమైని బేవ్యూ ప్రాజెక్ట్స్ - జీ స్టూడియోస్ బ్యానర్ లపై బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. తెలుగు-తమిళం- హిందీలో ఈ చిత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదల కానుంది.
30 నిమిషాల్లో 40లక్షల మంది ట్రైలర్ వీక్షణ
దొంగా పోలీస్ ఛేజ్ లు గేమ్ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చినా వలీమై వేరు అని ఇది హెచ్.వినోద్ స్టైల్లో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్ అని ట్రైలర్ తో అర్థమైంది. ఇంతకుముందు విడుదలైన ట్రైలర్ ని కేవలం 30 నిమిషాల్లోనే 40లక్షల మంది వీక్షించడం ఒక రికార్డ్. దొరికినట్టే దొరికి చేజారిపోయే దొంగ కథతోనే ధూమ్ సిరీస్ ని రన్ చేయగా..బోనీ ఇప్పుడు అలాంటి స్టోరీతోనే అజిత్ హీరోగా ఈ చిత్రం తీసారు. ఇందులో పోలీస్ తో దొంగ ఆడే గేమ్ మరో లెవల్లో ఉంటుంది. మేధావులకు మస్కా వేసే అపరమేధోతనంతో దొంగ దొరక్కుండా తప్పించుకునే కాన్సెప్టు ఇది.
తళా అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా.. తెలుగు హీరో కార్తికేయ దొంగ గా నటించాడు. అజిత్ ఛామ్ ని స్టైల్ ని ఎలివేట్ చేసిన ట్రైలర్ ఇది. కార్తికేయ రేసింగ్ ఎబిలిటీని హై ఎనర్జీని ఈ సినిమాలో చూపించినంతగా ఇంకెక్కడా చూపించరేమో అన్నంతగా కనిపించబోతున్నాడు. వలీమై ట్రైలర్ ఆద్యంతం కళ్లు తిప్పుకోనివ్వని ట్రీట్. వైట్ కాలర్ నేరగాడిగా డేర్ డెవిల్ ఫీట్స్ తో అడ్వెంచర్స్ తో దొంగతనాలు చేస్తూ పోలీసులను మట్టి కరిపించే నేర్పరిగా కార్తికేయ పాత్ర మరో లెవల్లో కనిపిస్తోంది. కార్తికేయ అండ్ గ్యాంగ్ అరాచకాలు రోబరీలను ఒక లెవల్లో తెరపై ఆవిష్కరించారు. ట్రైలర్ ఎంతో గ్రిప్పింగ్ గా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మోడ్ లో ఆకట్టుకుంది. ఇక సినిమా ఆద్యంతం ఇదే టింజ్ ఉంటే ధూమ్ తరహాలో బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయంగా కనిస్తోంది. ఇది పక్కా పాన్ ఇండియా కంటెంట్ తో షేక్ చేయబోతున్న సినిమా అనడంలో సందేహం లేదు. గగుర్పొడిచే బైక్ ఛేజ్ లు కార్ ఛేజ్ లకు కొదవేమీ లేదు. గేమ్ అయిపోలేదు.. నెక్ట్స్ లెవల్ కి వెళ్లబోతోంది! అంటూ కార్తికేయ డైలాగ్ తో కొనసాగింపు పార్ట్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చేశారు. మొత్తానికి వలీమై అదిరే ట్రీట్ ఇవ్వబోతోంది
. ఈ చిత్రానికి దాదాపు 160 కోట్ల బడ్జెట్ ఖర్చయింది. ఫిబ్రవరి 24న ఈ చిత్రం విడుదలవుతోంది.