అవికా గోర్ కి జ‌రిగినట్టే ఉప్పెన బ్యూటీకి?

Update: 2022-02-21 01:17 GMT
రంగుల మాయా ప్ర‌పంచంలో అంద‌రినీ మెప్పించి కెరీర్ ప‌రంగా ఎద‌గ‌డం అంత సులువేమీ కాదు. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఉన్న‌ట్టే ఇక్క‌డా గుడ్ బ్యాడ్ అనేవి ఉంటాయి. ఎదిగేవాళ్ల‌ను కిందికి లాగేందుకు ఈవిల్స్ వెంటాడుతుంటాయి. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోల‌కే ఈ ముప్పు త‌ప్ప‌లేదు. అయితే ఇలాంటి చోట నెగ్గుకొస్తేనే ఏ హీరోకి అయినా హీరోయిన్ కి అయినా లాంగిటివిటీ అనేది ఉంటుంది. సుదీర్ఘ కాలం కెరీర్ ని ర‌న్ చేయ‌గ‌లుగుతారు. అలా కాకుండా కోప‌తాపాల‌కు పోయినా ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగినా దాని ప‌ర్య‌వ‌సానం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. స‌హ‌నం ఇక్కడ చాలా ఇంపార్టెంట్.

అయితే టాలీవుడ్ లో తొలి సినిమాతోనే 100కోట్ల క్ల‌బ్ నాయిక‌గా పాపుల‌రైన యువ‌న‌టి కృతి శెట్టిపైనా ఇలా బురద జ‌ల్లే వ్య‌వ‌హారం ఎక్కువైంద‌ని తాజా ప‌రిణామం చెబుతోంది. కృతిపై ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగుతోంది. క్ర‌మ‌శిక్ష‌ణ లేని న‌టి అని ఇత‌రుల‌ను గౌర‌వించ‌ద‌ని ఒక సెక్ష‌న్ ప్ర‌చారం చేయ‌డం బ‌య‌ట‌ప‌డింది.

కెరీర్ ఆరంభం ఇలాంటివి చాలా మంది యువ‌నాయిక‌లు ఎదుర్కొన్నారు. అగ్ర నాయిక‌ల‌కు ఇది త‌ప్ప‌లేదు. ఇటీవ‌ల ఉయ్యాల జంపాల చిత్రంతో గొప్ప విజ‌యం అందుకున్న అవికా గోర్ విష‌యంలోనూ ఇలాంటి దుష్ప్ర‌చారం సాగింది. త‌న‌కు క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని పారితోషికం పెంచేస్తోంద‌ని కూడా ప్ర‌చారం సాగించారు. కార‌ణం ఏదైనా కానీ అవిక కెరీర్ డైల‌మాలో ప‌డిపోయింది. అయితే ఇప్పుడు కృతిశెట్టి మ‌రీ అంత ఘోర‌మైన ప‌రిస్థితిలో లేదు. వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటోంది. అన్నీ హిట్లు కొడుతోంది.

`ఉప్పెన` తనకు పెద్ద చిత్రాల‌ అదృష్టం ఇస్తుందని కృతి ఊహించనే లేదు. ఆ త‌ర్వాత నానీతో శ్యామ్ సింగ రాయ్ .. నాగ‌చైత‌న్య‌తో బంగార్రాజు లో అవ‌కాశాలు అందుకుంది. ఇవ‌న్నీ బంప‌ర్ హిట్ట‌య్యాయి. త‌న కెరీర్ కి పెద్ద ప్ల‌స్ గా మారాయి. త‌దుప‌రి రామ్ స‌ర‌స‌న లింగుస్వామి చిత్రంలో కృతి ఆఫ‌ర్ అందుకుంది.  

అయితే ఇంత‌లోనే కృతి శెట్టి సెట్స్ కి సమయానికి రావ‌డం లేద‌ని .. క్రమశిక్షణ త‌ప్పింద‌ని ప్ర‌చారం సాగ‌డంతో షాక్ కి గుర‌య్యింద‌ట‌. ఇతర సహ నటుల తో చాలా అగౌరవంగా వ్యవహరిస్తుందని  దుష్ప్రచారం సాగింది. నిప్పు లేనిదే పొగ రాదు అని మీడియా ప్ర‌చారం చేసిన తీరు త‌న‌కు షాక్ ఇచ్చింద‌ట‌.

అయితే త‌న‌పై ఈ ప్రచారం చేస్తున్న వాళ్ల‌ను క‌డిగేయాల‌ని అనుకుంద‌ట కృతి. అంతేకాదు త‌న ప్ర‌చార‌ బృందాన్ని పిలిచి దీనిపై మీడియా ముందు అధికారికంగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అనుకుంద‌ట‌. కానీ ఇలాంటివ‌న్నీ ఇక్క‌డ మామూలే అని స‌ర్ధి చెప్ప‌డంతో ఆ త‌ర్వాత దానిని విర‌మించుకుంద‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా కృతి దూకుడు గురించి చ‌ర్చ సాగుతోంది. అయితే ఈ ఏజ్ లో కొంత దూకుడు ఉంటుంది. కానీ నెమ్మ‌దిగా ఆలోచిస్తే కొన్నిటిని లైట్ తీస్కుంటే క‌లిగే ప్ర‌యోజ‌నం గురించి త‌న‌కు ఇత‌రులు బోలెడ‌న్ని సూచించారు. కాబ‌ట్టి దానిని ఫాలో అయిపోతేనే బెట‌ర్ అని అంటున్నారు.
Tags:    

Similar News