అమెరికా మార్కెట్ ఈరోజుల్లో తెలుగు సినిమాకి ఎంతో కీలకంగా మారింది. అక్కడ అగ్ర హీరోల సినిమాలు సునాయాసంగా మిలియన్ డాలర్ క్లబ్ లో చేరుతున్నాయి. 3.5 మిలియన్ డాలర్ల వరకూ నాన్ బాహుబలి కేటగిరీలో వసూలు చేసే సమర్థత ఉందని రంగస్థలం లాంటి సినిమా నిరూపించింది. 3 మిలియన్ డాలర్ క్లబ్ లో కొన్ని సినిమాలున్నాయి. 2 మిలియన్ డాలర్లు పైగా వసూళ్లతో చాలా సినిమాలు మంచి ఫలితాన్ని అందించాయి. అందుకే అమెరికా మార్కెట్ ని మరో నైజాంతో పోల్చడం మొదలైంది. 3.5 మిలియన్ డాలర్లు అంటే సుమారు 20కోట్లు. అంత పెద్ద మొత్తం వసూలు చేయడం అంటే ఆషామాషీ కాదు. కానీ ఈ మార్కెట్ ని ఇద్దరు మెగా హీరోలు లైట్ తీస్కోవడం షాక్ కి గురి చేస్తోంది.
అయితే దీనికి కారణాన్ని విశ్లేషిస్తే ఇటీవలి కాలంలో మెగాబ్రదర్స్ ఇద్దరూ పూర్తిగా రీమేక్ చిత్రాల వైపు దృష్టి సారించడమేనని విశ్లేషిస్తున్నారు. ఆ ఇద్దరూ బ్యాక్ టు బ్యాక్ మూడు నాలుగు రీమేక్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. దీనివల్ల ఓవర్సీస్ ఆడియెన్ బోర్ ఫీలవుతున్నారు. ఆల్రెడీ వేరే భాషలో హిట్టయిన సినిమాని మళ్లీ వేరొక హీరోతో చూసేందుకు ఎవరూ ఆసక్తిగా లేరని అమెరికా బాక్సాఫీస్ విశ్లేషకులు చెబుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. చిరు కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి చిత్రం ఆచార్య ఏప్రిల్ లో విడుదలవుతోంది. గాడ్ ఫాదర్- భోలా శంకర్ - వాల్టేర్ వీరన్న చిత్రాల షూటింగ్ లు సాగుతున్నాయి. వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కూడా చేయాల్సి ఉంది. ఇది ఈ సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాల్లో గాడ్ ఫాదర్- భోళా శంకర్ రీమేక్ లు. తాజా సమాచారం మేరకు.. మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ కు ఓకే చెప్పారట.
మలయాళ చిత్రం బ్రో డాడీ నచ్చడంతో రీమేక్ కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఈ రీమేక్ కోసం ఇద్దరు దర్శకులు చర్చలు జరుపుతున్నారు. దర్శకుడు ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ సంవత్సరంలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది. మెగాస్టార్ హోమ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. అతడు నటించిన వకీల్ సాబ్ - భీమ్లా నాయక్ రెండూ రీమేక్ సినిమాలే. ఇవి హిట్ టాక్ తెచ్చుకున్నా ఫుల్ రన్ లో సాధించిన విదేశీ వసూళ్లు చాలా తక్కువ. భీమ్లా నాయక్ ప్రారంభ వారాంతంలోనే దాదాపు 2 మిలియన్ డాలర్లు సాధించగా.. ఫుల్ రన్‌లో 2.4 మిలియన్ డాలర్లు మాత్రమే సంపాదించింది. దానికి అసలైన కారణం భీమ్లా నాయక్ రీమేక్ కావడమే. తెలుగులో గణనీయమైన భాగం అయ్యప్పనుమ్ కోషియుమ్ ని ఇప్పటికే చూసి ఉండడం వల్లనే ఎన్నారై జనం థియేటర్లకు రాలేదు.
ఇలాంటి రీమేక్ ని చూడటానికి సమయం వృథా చేయకూడదని కూడా ఆడియెన్ భావించారు. కారణం ఏదైనా కానీ చిరు మరియు పవన్ ఇద్దరూ ఇప్పుడు రీమేక్ లతో భారీ లైనప్ కలిగి ఉన్నారు. చిరు లూసిఫర్ (గాడ్ ఫాదర్).. వేదాళం (భోళా శంకర్) రీమేక్ లలో నటిస్తున్నారు. వీటి ఫలితం అమెరికాలో ఎలా ఉండనుందో వేచి చూడాలి.
పవన్ తదుపరి తమిళ చిత్రం వినోదయ సితం తెలుగు రీమేక్ లో నటించనున్నారు. నిజానికి వినోదయ సీతమ్మకి కమర్షియల్ అప్పీల్ చాలా తక్కువ. ఈ సినిమా పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా లేదనేది అందరి అభిప్రాయం. కానీ దీనిని ఎలా వర్కవుట్ చేస్తారో వెయిట్ చేయాల్సిందేనన్న చర్చ సాగుతోంది. ఇక ఆల్రెడీ చూసేసిన కంటెంట్ ని కొత్త హీరో ముఖంతో చూడాలా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పవన్ చిరుల కంటే ముందే విక్టరీ వెంకటేష్ రీమేక్ ల హీరోగా పాపులరయ్యారు. దగ్గుబాటి కాంపౌండ్ వీటిపై ఆసక్తిని కనబరిచింది. కానీ ఇప్పుడు మెగా హీరోలు పూర్తిగా రీమేక్ కంటెంట్ పై ఆధారపడడం కొన్ని వర్గాలను తీవ్రంగా నిరాశపరుస్తోంది. మరో నైజామ్ లాంటి అమెరికాని లైట్ తీసుకోవడం సరికాదని మెగాబ్రదర్స్ కి సూచిస్తున్నారు.