బిగ్గెస్ట్‌ డిజాస్ట‌ర్‌ గా 'రాధేశ్యామ్‌'..న‌ష్ట‌మెంతో తెలిస్తే షాకే!

Update: 2022-03-31 08:30 GMT
`సాహో` సినిమా త‌ర్వాత నేష‌న‌ల్ స్టార్ ప్ర‌భాస్ నుంచి వ‌చ్చిన చిత్ర‌మే `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా.. కృష్ణం రాజు, భాగ్యశ్రీ, జగపతిబాబు, స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. గోపీ కృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌, టి.సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

1970ల‌లో ఇట‌లీ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ పీరియాడికల్ ప్రేమ క‌థా చిత్రం.. గ‌త నాలుగేళ్ల నుంచి ప్రేక్ష‌కుల‌ను ఊరిస్తూ ఊరిస్తూ చిరాఖ‌ర‌కు మార్చి 11న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌లయాళం, హిందీ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల అయింది. మన రాత చేతుల్లో ఉండదు.. చేతల్లో ఉంటుందనే పాయింట్‌ను ఓ ప్రేమ కథతో భారీగా చెప్పాల‌ని చూశాడు ద‌ర్శ‌కుడు. ఇందులో హస్తసాముద్రిక నిపుణుడిగా ప్ర‌భాస్ త‌న న‌ట‌న‌తో మిస్మ‌రైజ్ చేశాడు.

విజువ‌ల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. కానీ, ప్రేక్ష‌కులు కోరే ట్విస్ట్‌లు లేక‌పోవ‌డం, క‌థ‌-క‌థ‌నం స్లోగా సాగ‌డం, ప్ర‌భాస్‌-పూజాల కెమిస్ట్రీ వ‌ర్కౌట్ అయినా.. వారి మ‌ధ్య బలమైన సీన్స్ ఉండ‌క‌పోవడం, కామెడీ స‌న్నివేశాలు అల‌రించ‌క‌పోవ‌డం వంటి అంశాలు మైన‌స్‌గా మారాయి. పైగా మ్యూజిక‌ల్‌గా కూడా ఈ సినిమా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ పాన్ ఇండియా చిత్రం బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

ఇక తాజాగా ఈ మూవీ ఫైన‌ల్ క‌లెక్ష‌న్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాటి ప్ర‌కారం.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 54.17 కోట్ల షేర్‌, రూ. 84.60 కోట్ల గ్రాస్ వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 83.12 కోట్ల షేర్‌, రూ. 151 కోట్ల‌ గ్రాస్ క‌లెక్ట్ చేసింది. అయితే విడుద‌ల‌కు ముందు ప్ర‌పంచ‌వ్యాప్తంగా  రూ. 208 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం..  రూ.210 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దూకింది.

కానీ, లాంగ్ ర‌న్‌లో రూ. 83.12 కోట్లనే వ‌సూల్ చేయ‌డంతో.. రాధేశ్యామ్‌ను కొన్న బ‌య్య‌ర్ల‌కు ఏకంగా రూ. 126 కోట్ల వ‌ర‌కు న‌ష్టం వాటిల్లింద‌ని జోరుగా టాక్ న‌డుస్తోంది. కాగా, థియేట‌ర్స్‌లో ఆక‌ట్టుకోలేక‌పోయిన‌ ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. ఏప్రిల్ 1న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ  అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో రాధేశ్యామ్ స్ట్రీమింగ్ కాబోతోంది.
Tags:    

Similar News